Saturday, January 18, 2025
Homeసినిమా'విరాటపర్వం'కథ సాయిపల్లవి చుట్టూనే తిరుగుతుందట! 

‘విరాటపర్వం’కథ సాయిపల్లవి చుట్టూనే తిరుగుతుందట! 

Main Role: సాయిపల్లవికి తెలుగులో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ మధ్య కాలంలో ఆమె నుంచి వచ్చిన ‘లవ్ స్టోరీ’ .. ‘శ్యామ్ సింగ రాయ్’ భారీ విజయాలను నమోదు చేశాయి. దాంతో సహజంగానే ‘విరాటపర్వం‘ సినిమాపై అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో ఆమెకి జోడీగా రానా కనిపించనున్నాడు. సురేశ్ బాబు – సుధాకర్  చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకి వేణు ఉడుగుల దర్శకత్వం వహించాడు. సురేశ్ బొబ్బిలి సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను, ఈ నెల 17వ తేదీన విడుదల చేస్తున్నారు.

ఈ సినిమా 1990 .. నక్సలిజం నేపథ్యంలో రూపొందుతోంది .. రానా నక్సలైట్ నాయకుడిగా కనిపించనున్నాడని అనగానే అందరూ కూడా ఈ సినిమాకి హీరో రానానే అనుకున్నారు. ఆయన సరసన సాయిపల్లవి కథానాయికగా కనిపించనుందని భావించారు. ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్స్ లో సాయిపల్లవిని హైలైట్ చేయడం జరిగింది. ఆమెకి గల క్రేజ్ కారణంగా  అలా చేసి ఉంటారని భావించారు. కానీ ఈ సినిమాలో ప్రధానమైన పాత్ర సాయిపల్లవిదేననీ .. ఆమె పాత్ర చుట్టూనే కథ తిగుతుందనే విషయం స్పష్టమైపోయింది.

“ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించమని కోరుతూ ఈ ప్రాజెక్టు నా దగ్గరికి రావడం జరిగింది. అప్పటికే సాయిపల్లవి ఎంపిక జరిగిపోయింది. నేను చేసిన పాత్ర కోసం ఎవరిని తీసుకుందామా అనే వెతుకులాటలో దర్శకుడు ఉన్నాడు. అప్పుడు ఆ పాత్రను నేను చేస్తే బాగుటుందని అనిపించింది. అలా ఈ ప్రాజెక్టులో నేను భాగమయ్యాను” అని ఇటీవల రానా చెప్పాడు. “ఈ సినిమాలో సాయిపల్లవి  నటన చూసి తీరవలసిందే. ఆమెతో కలిసి యాక్ట్ చేయడం వల్లనేనేమో నేను కూడా బాగానే చేశానని అనిపించింది” అని అన్నాడు. ఈ సినిమాతో సాయిపల్లవి హ్యాట్రిక్ హిట్ కొడుతుందేమో చూడాలి.

Also Read : సాయిపల్లవికి గల క్రేజ్ అలాంటిది మరి! 

RELATED ARTICLES

Most Popular

న్యూస్