Gandharwa: సందీప్ మాధవ్, గాయ్రతి ఆర్. సురేష్ జంటగా నటించిన చిత్రం `గంధర్వ`. ఫన్నీ ఫాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బేనర్ పై యఎస్.కె. ఫిలిమ్స్ సహకారంతో యాక్షన్ గ్రూప్ సమర్పిస్తున్న చిత్రమిది. అప్సర్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ సుభాని ఈ చిత్రాన్ని నిర్మించారు. సెన్సార్ పూర్తయి జూలై1న ఈ గంధర్వ చిత్రం విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా గంధర్వ చిత్ర హీరో సందీప్ మాధవ్ ఈ చిత్రం గురించి, తన కొత్త సినిమా గురించి పలు వివరాలు తెలియజేశారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే…
ఈ కథను లాక్‌డౌన్‌లో విన్నాను. సంగీత దర్శకుడు షకీల్ ద్వారా అప్సర్ గారు కథ చెప్పారు. విన్న వెంటనే బాగా నచ్చేసింది. ఎందుకు సినిమా చేద్దామనుకున్నానంటే.. ఒక పాత్ర పై సినిమా రన్ అవుతుంది. జనరల్ సినిమాలోని అంశాలతో పాటు సరికొత్త పాయింట్ దర్శకుడు రాసిన విధానం, నటుడిగా పెర్‌ఫార్మెన్స్‌కు బాగా స్కోప్ వున్న కథ. అందుకే ఖచ్చితంగా చేయాలనిపించింది.
మిలట్రీ పర్సన్‌గా నటించాను. తల్లిదండ్రులను, భార్యాపిల్లలను వదిలి వెళ్ళాల్సివస్తే తనేం చేస్తాడు. పెళ్ళయిన మరుసటిరోజే యుద్ధానికి వెళ్ళాల్సి వస్తే తను ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడు. మొత్తంగా తను అసలు కనిపించకుండాపోతే పరిస్థితి ఎలా వుంటుంది? అనేది ఈ సినిమాలో చూపిస్తున్నాం. ఫైనల్‌గా కుటుంబ కథాచిత్రమిది. ఈ సినిమా మేం అనుకున్నదానికంటే చాలా బాగా వచ్చింది. సాయికుమార్, బాబూమోహన్, పోసాని కృష్ణ మురళి, గాయత్రీ సురేష్ ముఖ్యపాత్రలు పోషించారు. సీనియర్స్ వల్ల మా సినిమాకు చాలా ప్లస్ అయింది.
దర్శకుడు అప్సర్ గురించి చెప్పాలంటే.. తను మిలట్రీ వాడిగా ఫీలయి కథను రాసుకున్నారు. యుద్ధానికి వెళితే ఆ కుటుంబంలో వాతావరణ ఎలా వుంటుందో ఆయనకు బాగా తెలుసు. పైగా దర్శకుడు కావాలనే తపనతో తెలుగు నేర్చుకుని కథను రాసుకున్నారు. ఆయన ఆలోచన విధానం నాకు బాగా నచ్చింది. ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్ సభ్యులు కొత్తపాయింట్ చెప్పారు. న్యూజనరేషన్ మూవీ ఇది అని కితాబిచ్చారు. నెక్ట్స్ మాస్ మహరాజ్ అనే సినిమా చేస్తున్నా. రాజ్‌తరుణ్ కూడా వున్నాడు. అందులో కూడా 50 ఏళ్ళ వ్యక్తిగా చేస్తున్నా. అసీఫ్‌ఖాన్, ప్రదీప్ రాజు నిర్మాతలు. కోతలరాయుడు చేసిన సుధీర్ రాజా దర్శకుడు. ఇది పెద్ద కమర్షియల్ సినిమా అవుతుంది.
Also Read : `గంధర్వ` లిరికల్ వీడియోసాంగ్ విడుదల