Saturday, November 23, 2024
HomeTrending Newsతెలంగాణలో ష్నైడర్ ఎలెక్ట్రిక్ విస్తరణ

తెలంగాణలో ష్నైడర్ ఎలెక్ట్రిక్ విస్తరణ

తెలంగాణలో మరో తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు ష్నైడర్ ఎలెక్ట్రిక్ ఈ రోజు ప్రకటించింది. మంత్రి కే తారకరామారావుతో దావోస్ లో సమావేశమైన ష్నైడర్ ఎలెక్ట్రిక్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ లుక్ రిమోంట్ ఈ మేరకు కంపెనీ తరఫున ప్రకటన చేశారు. ఇప్పటికే తెలంగాణలో కార్యకలాపాలు కొనసాగుతున్న తమ యూనిట్ ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రమాణాలు కలిగిన ఫ్యాక్టరీ గా అడ్వాన్స్డ్ లైట్ హౌస్ అవార్డుని దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో పొందిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. IIOT infrastructure , predictive / prescriptive analytics, AI deep learning వంటి సాంకేతిక పరిజ్ఞానాలను వాడినందుకు ఈ అవార్డు దక్కినట్లుగా రిమొంట్ తెలిపారు. తెలంగాణలో తమ కంపెనీ కార్యకలాపాలు సాఫీగా కొనసాగుతున్నాయని, రాష్ట్రంలో ఉన్న పరిశ్రమల స్నేహపూర్వక వాతావరణం పైన ఆయన ప్రశంసలు కురిపించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, తమ విస్తరణ ప్రణాళికలను ప్రకటిస్తున్నట్లు తెలిపారు. తమ నూతన తయారీ ప్లాంట్ నుంచి ఎనర్జీ మేనేజ్మెంట్ మరియు ఆటోమేషన్ ఉత్పత్తులను తయారు చేయబోతున్నట్లు తెలిపారు.

తెలంగాణ రాజధాని పెట్టుబడులకు రాజధానిగా మార్చేందుకు తాము ప్రయత్నం చేస్తున్నామని తెలిపిన మంత్రి కేటీఆర్, తమ ప్రయత్నంలో భాగంగా ఈరోజు ష్నైడర్ ఎలెక్ట్రిక్ తన తయారీ పరిశ్రమను విస్తరించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ష్నైడర్ ఎలెక్ట్రిక్ అదనపు తయారీ యూనిట్ వలన 1000 నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో తమ కార్యకలాపాలను విస్తరిస్తున్న కంపెనీకి ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు.

Also Read : తెలంగాణకు అలియాక్సిస్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్