షాంఘై సహకార సహకార సంస్థ సదస్సు (SCO Summit) ఉజ్బెకిస్థాన్‌లో సమర్‌ఖండ్‌లో కొనసాగుతోన్న సదస్సులో రష్యా, చైనా అధ్యక్షులతో పాటు భారత్‌, పాకిస్థాన్‌ ప్రధాన మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ముచ్చటించారు. ఈ సందర్భంగా మోదీ, పుతిన్‌ పలు విషయాలపై చర్చించారు. రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య నెలకొన్న యుద్ధంపై భారత వైఖరి ఏంటో ప్రధాని మోదీ మరోసారి చెప్పకనే చెప్పారు. గతంలో పుతిన్‌తో మాట్లాడిన వ్యాఖ్యలను సైతం ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఉక్రెయిన్​తో యుద్ధం విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘యుద్ధానికి ఇది సమయం కాదు’ అని పుతిన్​కు సూచించారు. దీనిపై పుతిన్ స్పందిస్తూ.. వీలైనంత త్వరగా ఉక్రెయిన్ సంక్షోభాన్ని ముగించాలని చూస్తున్నానని తెలిపారు. ఈ సంక్షోభం విషయంలో ఇండియాకు ఉన్న ఆందోళనను తాము అర్థం చేసుకోగలమని చెప్పారు. అయితే, ఉక్రెయిన్ నాయకత్వం చర్చల ప్రక్రియను తిరస్కరించిందని, యుద్ధరంగంలో పోరాటం ద్వారానే లక్ష్యాలను సాధించాలని వాళ్లు కోరుకుంటున్నారని అన్నారు. అలాగే రెండు దేశాల మధ్య సంబంధాలు, ప్రాంతీయ, ప్రపంచ పరిణామాలపైనా మోడీ, పుతిన్ చర్చించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

Also Read : కేంద్రం కీలక నిర్ణయం… త్వరలోనే 5జీ సేవలు