Saturday, January 18, 2025
Homeస్పోర్ట్స్CWG-2022: బాడ్మింటన్: ఫైనల్లో సేన్, కిడాంబికి కాంస్యం

CWG-2022: బాడ్మింటన్: ఫైనల్లో సేన్, కిడాంబికి కాంస్యం

బర్మింగ్ హమ్ కామన్ వెల్త్ క్రీడల్లో బ్యాడ్మింటన్ విభాగంలో పురుషుల, మహిళల సింగిల్స్ తో పాటు పురుషుల డబుల్స్ లో భారత క్రీడాకారులు గోల్డ్ మెడల్ రేసులో నిలిచారు.

మొదటగా పివి సింధు మహిళల సింగిల్స్ లో ఫైనల్లో ప్రవేశించిన సంగతి విదితమే.

నిన్న జరిగిన సెమీ ఫైనల్లో లక్ష్య సేన్ 21-10;18-21; 21-16 తో సింగపూర్ కు చెందిన జాసన్ తెహ్ జియాపై విజయం సాధించి ఫైనల్లో అడుగు పెట్టాడు.

పురుషుల సింగిల్స్ లో కిడాంబి శ్రీకాంత్ 21-13;19-21; 10-21 తేడాతో మలేషియా ఆటగాడు టంగ్ చేతిలో పరాయజం పాలయ్యాడు.

పురుషుల డబుల్స్ లో సాత్విక్ సాయిరాజ్ రాంకీ రెడ్డి- చిరాగ్ శెట్టి జోడీ 21-6;21-15తో మలేషియా జోడీపై విజయం సాధించి ఫైనల్లో అడుగు పెట్టారు.

మహిళల డబుల్స్ లో గాయత్రి గోపీ చంద్- త్రెసా జాలీ సెమీ ఫైనల్ మ్యాచ్ లో 13-21-; 16-21తేడాతో మలేషియా ఆటగాళ్ళ చేతిలో ఓడిపోయారు.

ఆ తర్వాత కాంస్యం కోసం జరిగిన మ్యాచ్ లో కిడాంబి శ్రీకాంత్ 21-9;21-18 తో జాసన్ తెహ్ జియాపై విజయం సాధించాడు.

గాయత్రి-జాలీ జోడీ 21-15;21-18 తో ఆస్ట్రేలియా క్రీడాకారులపై విజయం సాధించి కాంస్యం గెలుపొందారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్