ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా సీనియర్ జర్నలిస్ట్ పోలా విజయబాబుని ప్రభుత్వం నియమించింది. జర్నలిస్టుగా జీవితాన్ని మొదలుపెట్టిన విజయబాబు పలు పత్రికల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. ఆంధ్రప్రభ దినపత్రికకు కొంతకాలంపాటు ఎడిటర్ గా కూడా వ్యవహరించారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో సమాచార హక్కు చట్టం కమిషనర్ గా కూడా ఆయన పనిచేశారు.
రెండేళ్ళ పాటు విజయబాబు అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. గతంలో ఈ పదవి నిర్వహించిన మాజీ ఎంపీ అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రాజీనామా చేయడంతో ఆ స్థానంలో విజయబాబును నియమించారు.
విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మారుస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా యార్లదగ్గ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
విజయబాబు నియామక ఉత్తర్వులను తెలుగులోనే ఇవ్వడం గమనార్హం.