7.2 C
New York
Monday, December 11, 2023

Buy now

HomeTrending Newsటీఆరెస్,బీజేపీ ఓటమి చారిత్రక అవసరం - రేవంత్ రెడ్డి

టీఆరెస్,బీజేపీ ఓటమి చారిత్రక అవసరం – రేవంత్ రెడ్డి

సెప్టెంబర్ 17 పై టీఆరెస్,బిజెపి లు డ్రామాలు అడుతున్నాయని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ కి స్వాతంత్రం ఇప్పించిన పార్టీ కాంగ్రెస్ అని కాంగ్రెస్ పేటెంట్ ని గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. సెప్టెంబర్ 17, భారత్ జోడో యాత్ర, మునుగోడు ఎన్నికపై ఈ రోజు గాంధీ భవన్ లో జరిగిన టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఉత్తమ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మైనార్టీలకు రక్షణ కల్పిస్తున్నామని కేసీఆర్, మెజారిటీ ప్రజలకు అండగా ఉన్నామని బీజేపీ నాటకాలు అడుతున్నాయని విమర్శించారు. తెలంగాణ విమోచన ఉద్యమం… ముస్లింలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం కాదు.. రాచరికనికి వ్యతిరేకంగా జరిగిన పోరాటమన్నారు.

సెప్టెంబర్ 17 2022 – సెప్టెంబర్ 17 2023 వరకు వజ్రోత్సవాలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ను కేసీఆర్ తెచ్చారని ప్రజల్లో భ్రమ కల్పిస్తున్నారని, ఉద్యమంలో వాహనాలకు TG ఉంది ..కానీ రాష్ట్రం ఏర్పడిన తరువాత వారి పార్టీకి గుర్తుగా దానిని TS గా మార్చారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక దానిని TG గా మారుస్తామని స్పష్టం చేశారు.

అందేశ్రీ రాసిన జయ జయహే తెలంగాణను రాష్ట్ర విభజన జరిగిన తరువాత దానిని పట్టించుకోలేదని, కాంగ్రెస్ వచ్చిన తరువాత అందేశ్రీ రాసిన జయ జయహే తెలంగాణను అధికార గీతంగా చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. టీఆరెస్ సృష్టించిన తెలంగాణ తల్లి కాకుండా ..సబ్బండ వర్గాలకు సంబంధించిన తెలంగాణ తల్లి ని గ్రామగ్రామాన విగ్రహాలు ప్రతిష్ఠిస్తామన్నారు. పక్క రాష్ట్రాల్లో జాతీయ జెండాతో పాటు రాష్ట్ర ప్రభుత్వంకి ప్రత్యేక ప్లాగ్ ఉంటుంది..మనం వచ్చిన తరువాత తెలంగాణ రాష్ట్రానికి కూడా ప్రత్యేక ఫ్లాగ్ రూపొందిస్తామన్నారు. ఇవన్నీ తెలంగాణ మేధావులు సూచనలు చేశారన్నారు.

మునుగోడు ఉప ఎన్నిక

మునుగోడు ఉప ఎన్నికల్లో సోనియాగాంధీ పాల్వాయి స్రవంతి పేరును ప్రకటించారని, అభ్యర్థి విషయంలో అందరిదీ ఒకటే ఆలోచన అన్నారు. ఒక్కో మండలానికి ఒక్కో నాయకుని ఇంచార్జ్ గా నియమించారు.. ఒక్కో మండలనికి ఇద్దరు సహాయ ఇంచార్జ్ ల నియామకం జర్గిందన్నారు. 300 బూత్ లకు ఒక్కొక్కరికి రెండు చొప్పున 150 మంది నాయకుల నియామకం.. తెలంగాణలో ఉన్న 200 మంది ముఖ్య నాయకులను మునుగోడు కు పంపిస్తున్నామని రేవంత్ తెలిపారు. సెప్టెంబర్ 18 నుండి అందరం క్షేత్ర స్థాయిలో పని చేద్దామని..అందరం సర్పంచ్ గా పోటీ చేస్తున్నామనుకొని కష్టపడాలని పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. ఈ ఉప ఎన్నిక ద్వార టీఆరెస్,బీజేపీ ఓటమి చారిత్రక అవసరమని, సభల వల్ల ఉపయోగం లేదని, డోర్ డోర్ తిరిగి కాంగ్రెస్ అవసరాన్ని అవగాహన కల్పించాలన్నారు. అక్కడ ఉన్న కమ్మునిస్ట్ కార్యకర్తలకు ఆవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. దుబ్బాక మోడల్ ను మునుగోడు లో ఉపయోగించాలి..నల్గొండ అంటేనే కాంగ్రెస్ అనే విధంగా చేయాలని రేవంత్ అన్నారు.

తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర

అక్టోబర్ 24 న రాహుల్ గాంధీ పాదయాత్ర తెలంగాణకు ఎంట్రీ అవుతుందని, కృష్ణా నది బ్రిడ్జి మీదుగా రాష్ట్రంలోకి రాహుల్ వస్తారని రేవంత్ వెల్లడించారు. 15 రోజుల పాటు తెలంగాణలో రాహుల్ గాంధీ ఉంటారని, మక్థల్ ,దేవరకద్ర , మహబూబ్నగర్, జడ్చర్ల, షాద్ నగర్, శంషాబాద్, ఔటర్ రింగ్ రోడ్డు,మత్తంగి టోల్ గేట్,పఠాన్ చేరు , సంగారెడ్డి,జోగిపేట, శంకరం పేట మీదుగా నాందేడ్ కి రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర వెళ్తుందన్నారు. 350 కిలోమీటర్లు ఈ యాత్ర కొనసాగుతుందని, 15 రోజులు రోజోకో పార్లమెంట్ నియోజకవర్గ నేతలు రాహుల్ గాంధీతో పాదయాత్ర లో పాల్గొని నడుస్తారని చెప్పారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ లు ఒకటిగా నడుస్తారని, ఉదయం 7:30 -11:00 వరకు 15 కిలోమీటర్లు నడుస్తున్నారు.. 3:30 – 6:30 వరకు రెండవ విడత ఉంటుందని రేవంత్ రెడ్డి వివరించారు.

Also Read రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర

RELATED ARTICLES

Most Popular

న్యూస్