Saturday, January 18, 2025
Homeస్పోర్ట్స్CWG-2022:  టేబుల్ టెన్నిస్ లో రజతం, అథ్లెటిక్స్ లో రెండు కాంస్యాలు

CWG-2022:  టేబుల్ టెన్నిస్ లో రజతం, అథ్లెటిక్స్ లో రెండు కాంస్యాలు

కామన్ వెల్త్ గేమ్స్, టేబుల్ టెన్నిస్ పురుషుల డబుల్స్ లో సాతియన్ జ్ఞాన శేఖరన్-శరత్ ఆచంట జోడీ రజత పతకం సంపాదించారు. నేడు జరిగిన ఫైనల్లో ఇంగ్లాండ్ క్రీడాకారులు పాల్ డ్రింక్ హాల్- లియామ్ పిచ్ ఫోర్డ్ జోడీపై 3-2 (11-8; 8-11; 3-11; 11-7; 4-11)తో ఓటమి పాలై రెండో స్థానంలో నిలిచారు.

పురుషుల 10 కిలోమీటర్ల రేస్ వాక్ లో మన దేశానికి చెందిన సందీప్ కుమార్ కాంస్య పతకం గెల్చుకున్నాడు. తన గమ్యాన్ని 38:49:21 నిమిషాల్లో సాధించగా, కెనడాకు చెందిన ఎవాన్ డన్ ఫీ 38:36:37తో గోల్డ్;  ఆస్ట్రేలియా వాకర్ డెక్లాన్ టింగ్లే 38:43:33 నిమిషాల్లో పూర్తి చేసి సిల్వర్ మెడల్ సంపాదించారు.

మహిళల జావెలిన్ త్రోలో భారత క్రీడాకారిణి  అన్ను రాణి మూడో స్థానంలో నిలిచారు. తన మూడో ప్రయత్నంలో 60 మీటర్ల పాటు విసిరి పతకం ఖాయం చేసుకుంది. ఆస్ట్రేలియా అథ్లెట్లు కేల్సీ బార్బర్ 64.43 మీటర్లతో స్వర్ణం, మెకెంజీ లిటిల్ 64.27 మీటర్లతో రజతం గెల్చుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్