Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్ఇండోనేషియా మాస్టర్స్:  సింధు, సేన్ ఓటమి

ఇండోనేషియా మాస్టర్స్:  సింధు, సేన్ ఓటమి

Over: ఇండోనేషియా మాస్టర్స్ -2022  టోర్నీలో ఇండియా ఆటగాళ్ళు క్వార్టర్ ఫైనల్స్ దాటలేకపోయారు. సింధు, లక్ష్య సేన్ ఇద్దరే రెండో రౌండ్ దాటి క్వార్టర్స్ లో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. నేడు జరిగిన మ్యాచ్ లలో ఇద్దరూ ఓటమి పాలయ్యారు. దీనితో ఈ టోర్నీలో ఇండియా కథ ముగిసినట్లయింది.

మహిళల సింగిల్స్ విభాగంలో నేడు జరిగిన క్వార్టర్స్ మ్యాచ్ లో థాయ్ లాండ్ క్రీడాకారిణి రట్చనోక్ ఇంటానన్ చేతిలో 21-12;21-10 తేడాతో పివి సింధు పరాజయం పాలైంది.

పురుషుల సింగిల్స్ మ్యాచ్ లో లక్ష్య సేన్ పై చైనీస్ థైపీ ఆటగాడు చౌ టిన్ చెన్ చేతిలో 21-16; 12-21; 21-14 తేడాతో ఓటమి పాలయ్యాడు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్