Saturday, January 18, 2025
HomeTrending Newsటిడిపి, వైసీపీ డ్రామా పార్టీలు: సోము

టిడిపి, వైసీపీ డ్రామా పార్టీలు: సోము

సిఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయంపై సోము మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడ రాజధాని… వాల్తేరు క్లబ్ లోనా అని ప్రశ్నించారు. తెలుగుదేశం, వైఎస్సార్సీపీ  రెండు పార్టీలూ డ్రామాలు చేస్తున్నాయని మండిపడ్డారు.  ఒకరికి ఐదేళ్ళు పరిపాలించే అవకాశం ఇస్తే ఏమీ చేయలేకపోయారని, ఇప్పుడు మూడున్నరేళ్ళయినా ఈ  సిఎం కూడా ఏమీ చేయలేదని చంద్రబాబు, జగన్ లను ఉద్దేశిస్తూ విమర్శించారు. అమరావతిలో బాబు ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని, ఇప్పుడు ఈ సిఎం మూడు రాజధానులంటూ మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. విశాఖ బిజెపి కార్యాలయంలో సోము మీడియాతో మాట్లాడారు.

బిజెపి హయాంలో కొత్తగా ఏర్పాటు చేసిన రాష్ట్రాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా రాజధానులు  నిర్మించుకున్నాయని, కానీ ఏపీలో రైతుల నుంచి భూమి తీసుకొని వారిని రోడ్డుపై వదిలేశారని దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని అయన ప్రశ్నించారు. రాష్ట్రంలో వైసీపీ, టిడిపిలు కుటుంబ పార్టీలని, వచ్చే ఎన్నికల్లో ఈ రెండూ తుడిచిపెట్టుకుపోతాయని జోస్యం చెప్పారు.

రాష్ట్రంలో ఏ సమస్యనూ ప్రభుత్వం జగన్ ప్రభుత్వంపట్టించుకోవడం లేదని,  నిరుద్యోగం, మత్స్యకారులు, విద్యార్ధులు, పేదల ఆరోగ్యం  ఇలా అన్ని రంగాలనూ  గాలికి వదిలేశారని విమర్శించారు. కేంద్రం కట్టాల్సిన పోలవరం బాబు ఎందుకు కడుతున్నాడంటూ గతంలో ఆరోపించిన జగన్ ఇప్పుడు ఆ ప్రాజెక్టును ఎందుకు కడుతున్నాడని, హైడ్రో పవర్ ప్రాజెక్టు గురించి ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. చిన్న చిన్న షాపుల్లో కూడా పేటిఎం ఉంటుందని, కానీ మద్యం షాపుల్లో మాత్రం ఉండడడం లేదని ఎద్దేవా చేశారు. 2024లో అధికారమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల ప్రజా పోరు సభలు నిర్వహిస్తున్నామని, నేటి విశాఖ సభతోనే వీటిని ప్రారంభిస్తున్నామని చెప్పారు.

Also Read: చట్ట సభల హక్కులు కాపాడేందుకే

RELATED ARTICLES

Most Popular

న్యూస్