Saturday, July 27, 2024
HomeTrending NewsParliament: డాటా ప్రొటెక్షన్‌ బిల్లుకు లోక్ సభ ఆమోదం

Parliament: డాటా ప్రొటెక్షన్‌ బిల్లుకు లోక్ సభ ఆమోదం

భారతదేశ పౌరుల వ్యక్తిగత డాటా రక్షణ కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ‘డిజిటల్‌ పర్సనల్‌ డాటా ప్రొటెక్షన్‌ బిల్లు – 2023’ కు లోక్‌సభ సోమవారం ఆమోదం తెలిపింది. కేంద్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ లోక్‌సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. సభ్యుల మూజువాణి ఓటుతో బిల్లు సభ ఆమోదం పొందినట్లు స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు.

విపక్ష ఎంపీల ఆందోళనల నడుమే కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టడం, ఆ బిల్లు సభ ఆమోదం పొందడం వెంటవెంటనే జరిగిపోయాయి. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు దేశ పౌరుల డాటాను ఎలా వినియోగించుకోవాలి, ఎలా వినియోగించకూడదు..? అనే వివరాలను ఈ బిల్లులో పొందుపర్చారు.

లోక్‌సభ ఆమోదం పొందిన ఈ బిల్లు ఇక రాజ్యసభ ఆమోదం కూడా పొందితే చట్ట రూపం దాలుస్తుంది. ఆమోదం కోసం బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. రాజ్యసభలో ప్రభుత్వానికి కావాల్సిన మెజారిటీ లేనందున.. విపక్ష ఎంపీల్లో కూడా కొందరు బిల్లుకు అనుకూలంగా ఓటు వేస్తే ఈ బిల్లు చట్టరూపం దాల్చే అవకాశం ఉంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్