కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం లేదని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి వ్యాఖ్యానించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ పదవి తనకు ఇవ్వాలని కోటంరెడ్డి సోదరుడు పార్టీని కోరారమని, అయితే సోదరుడు శ్రీధర్ రెడ్డితో కలిసి చర్చించు కోవాలని సూచించినట్లు బాలినేని తెలిపారు. అధికార పార్టీ ఎమ్మెల్యే ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం లేదని, అయన ఇలా ఎందుకు మాట్లాడారో తెలియదన్నారు.
ఫోన్ ట్యాప్ చేశారన్నది శ్రీధర్ రెడ్డి అపోహ అయి ఉండొచ్చని, ఈ ఆరోపణలు నిజమా కాదా అనే దానిపై విచారణ జరిపిస్తామని, కానీ ఇలా పబ్లిక్ గా మాట్లాడడం తగదని, ఏదైనా ఉంటే పార్టీ అధిష్టానంతో మాట్లాడాలని సూచించారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఎవరినీ ఉపేక్షించబోమని, సిఎం జగన్ చర్యలు తీసుకుంటారని బాలినేని స్పష్టం చేశారు.