Sunday, January 19, 2025
HomeTrending Newsనేటి నుంచి రాష్ట్రంలో అమిత్ షా పర్యటన

నేటి నుంచి రాష్ట్రంలో అమిత్ షా పర్యటన

Amith Shah Visit to AP:
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా మూడు రోజుల పర్యటన నిమిత్తం శనివారం తిరుపతికి రానున్నారు. సాయంత్రం 7.40 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి నేరుగా తిరుమల చేరుకొని రాత్రి 9.40 గంటలకు శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరామ్ తిరుపతిలోని తాజ్‌ హోటల్‌కు చేరుకొని అక్కడే రాత్రి బస చేస్తారు. రేపు ఆదివారం ఉదయం భారత వైమానిక దళ హెలికాప్టర్‌ లో బయల్దేరి నెల్లూరు జిల్లా వెంకటాచలానికి చేరుకుంటారు. అక్షర విద్యాలయ, స్వర్ణ భారతి ట్రస్టు, ముప్పవరపు ఫౌండేషన్‌లకు సంబంధించిన పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. నైపుణ్యాభివృద్ధి కేంద్రం, గ్రామీణ స్వయం సాధికార శిక్షణ సంస్థను సందర్శిస్తారు. మధ్యాహ్నం స్వర్ణ భారతి ట్రస్టు 20వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 2.40 గంటలకు తిరుపతిలోని తాజ్‌ హోటల్‌కు చేరుకుంటారు.

రేపు మధ్యాహ్నం తాజ్ హోటల్‌లో జరిగే సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొంటారు. ఆ భేటీ ముగిశాక ఆదివారం రాత్రి తాజ్‌ హోటల్‌లోనే బస చేస్తారు. సోమవారం ఉదయం మరోసారి తిరుమల చేరుకొని వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతి విమానాశ్రయం నుంచి బయల్దేరి సాయంత్రం 5.40కు ఢిల్లీ చేరుకుంటారు.

Also Read : ముఖ్య అంశాలపై నివేదిక: సిఎం

 

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్