Saturday, January 18, 2025
HomeసినిమాJithender Reddy: 'జితేందర్ రెడ్డి' టైటిల్ పోస్టర్ విడుదల

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ టైటిల్ పోస్టర్ విడుదల

ఉయ్యాల జంపాల, మజ్ను చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు విరించి వర్మ తెరకెక్కిస్తున్న మూవీ జితేందర్ రెడ్డి. ఈ చిత్రాన్ని ముదుగంటి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత ముదుగంటి రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను దర్శకుడు దేవకట్టా విడుదల చేశారు. 1980 లో జరిగే ఒక పిరియడిక్ కథగా రూపొందుతున్న ఈ సినిమా తెలంగాణ నేపథ్యంలో రియల్ ఇంసిడెన్స్ ను బేస్ చేసుకొని నడిచే సీరియస్ యాక్షన్ డ్రామా కథగా ఈ చిత్రం ఉండబోతుంది.

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ వి.ఎస్.జ్ఞానశేఖర్ ఈ సినిమాకు కెమెరామెన్ గా వర్క్ చేస్తున్నారు. అలాగే గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు. నాగేంద్ర కుమార్ ఈ సినిమాకు ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. డైరెక్టర్ విరించి వర్మ తన గత రెండు చిత్రాలతో లవ్ స్టోరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈసారి పవర్ ఫుల్ యాక్షన్ డ్రామా తో నూతన చిత్రాన్ని తీస్తున్నారు. ఈ సినిమా హీరో ఎవరనేది త్వరలో ప్రకటించబోతున్నారు. అలాగే ఈ మూవీకి సంబంధించిన ఆర్టిస్టుల వివరాలు, ఫస్ట్ లుక్ త్వరలోనే మీడియాకు తెలియజేయనున్నారు చిత్ర యూనిట్.

RELATED ARTICLES

Most Popular

న్యూస్