‘వీరసింహారెడ్డి’ కి యూ/ఎ సర్టిఫికేట్.

బాలకృష్ణ, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వీరసింహారెడ్డి’. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సెన్సేషనల్ హిట్స్ అయ్యాయి. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న తాజాగా సెన్సార్ కార్యక్రమాల్ని పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి యూ/ ఎ సర్టిఫికేట్ ఇచ్చింది. బాలకృష్ణ పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్, గోపీచంద్ మలినేని టేకింగ్, సాయి మాధవ్ బుర్రా రాసిన ఇంటెన్స్ డైలాగ్స్, చార్ట్‌బస్టర్ ఆల్బమ్, ఎస్ థమన్ స్కోర్ చేసిన బీజియం, హై-ఆక్టేన్ యాక్షన్ ఎపిసోడ్స్, సెకండాఫ్‌లోని ఎమోషనల్ పార్ట్ సినిమాకు హైలైట్‌ గా నిలుస్తాయి.

అన్ని హంగులతో పర్ఫెక్ట్ ఫెస్టివల్ మూవీతో వస్తున్నందుకు సెన్సార్ అధికారులు కూడా టీమ్‌ని అభినందించారు. బాలకృష్ణ సరసన శ్రుతి హాసన్ హీరోయిన్ కథానాయిక గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. చంద్రిక రవి ప్రత్యేక పాటలో సందడి చేయగా, హనీ రోజ్ కీలక పాత్ర పోషించింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న వీరసింహారెడ్డి ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌ గా విడుదలౌతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *