Sunday, January 19, 2025
Homeసినిమా'వీరసింహారెడ్డి' ట్రైలర్ టాక్ ఏంటి..?

‘వీరసింహారెడ్డి’ ట్రైలర్ టాక్ ఏంటి..?

బాలకృష్ణ, మలినేని గోపీచంద్ ల కాంబినేషన్లో రూపొందిన భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘వీరసింహారెడ్డి’. ఇందులో శృతిహాసన్ నటించింది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. అఖండ బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో వీరసింహారెడ్డి మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఎప్పుడెప్పుడు వీరసింహారెడ్డి మూవీ వస్తుందా అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 12న భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు.

అయితే.. ఒంగోలులో భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేసింది. ఇక్కడే ట్రైలర్ ని విడుదల చేశారు. ఇంతకీ ట్రైలర్ ఎలా ఉందంటే… టెర్రిఫిక్ విజువల్స్ తో `సీమలో ఏ ఒక్కడూ కత్తిపట్టకూడదనే నేనొక్కన్ని కత్తి పట్టా అంటూ బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది. పరపతి కోసమో పెత్తనం కోసమో కాదు.. ముందు తరాలు నాకిచ్చిన బాధ్యత. నాది ఫ్యాక్షన్ కాదు.. సీమ మీద ఎఫెక్షన్..వీర సింహారెడ్డి.. అంటూ బాలయ్య మీసం తిప్పుతున్న తీరు ఆయన నట విశ్వరూపం థియేటర్లలో ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించేలా వుంది.

పుట్టింది పులిచర్ల.. చదివింది అనంతపురం.. రూలింగ్ కర్నూల్.. అంటూ బాలయ్య సింహ గర్జన చేస్తున్న తీరు మాస్ కి పండగ వాతావరణాన్ని ముందే తెచ్చేస్తోంది. మైలు రాయికి మీసం మొలిచి నట్టుండాదిరా అంటూ అజయ్ ఘోష్ చెబుతున్న డైలాగ్ లు సినిమా ఏ రేంజ్ లో సంక్రాంతి రచ్చ చేయనుందో హింట్ ఇచ్చేస్తున్నాయి. అఖండ తరువాత తమన్ మళ్లీ బ్యాగ్రౌండ్ స్కోర్ తో థియేటర్లలో స్పీకర్ బాక్సులు బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. అపాయింట్ మెంట్ లేకుండా వస్తే అకేషన్ చూడనూ లొకేషన్ చూడను.. ఒంటి చేత్తో ఊచకోత కోస్తా నా కొడకా… అంటూ బాలయ్య చెప్పే పవర్ ఫుల్ డైలాగ్స్ మరో స్థాయిలో వున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే..  బాలయ్య నట విశ్వరూపం వీరసింహారెడ్డి.. పూనకాలు తెప్పించడం ఖాయం అనిపిస్తుంది.

Also Read : శాశ్వతంగా నిలిచే సినిమా ‘వీరసింహారెడ్డి’ – బాలకృష్ణ

RELATED ARTICLES

Most Popular

న్యూస్