Saturday, January 18, 2025
Homeసినిమావెంకటేష్ మహాతో బాలయ్య మూవీ?

వెంకటేష్ మహాతో బాలయ్య మూవీ?

నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వీరసింహారెడ్డి అనే భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ చేస్తున్నారు. దీనికి మలినేని గోపీచంద్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. ఈ సినిమా తర్వాత బాలయ్య, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో సినిమా చేయనున్నారు. ఆల్రెడీ ఈ మూవీని అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాను జనవరిలో సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.

ఈ సినిమా తర్వాత బాలయ్య కంచరపాలెం సినిమాతో సక్సెస్ సాధించిన వెంకటేష్ మహాతో సినిమా చేయనున్నారని తెలిసింది. కంచెరపాలెం సినిమా తర్వాత వెంకటేష్‌ మహా ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ రెండు సినిమాల తర్వాత వెంకటేష్ మహా నటుడుగా బిజీ అయ్యాడు కానీ.. డైరెక్టర్ గా మరో సినిమా చేయలేదు. ఇప్పుడు నంద‌మూరి బాల‌కృష్ణ కోసం ఓ క‌థ రెడీ చేశాడు. ఇటీవ‌ల బాల‌య్య‌కు క‌లిసి క‌థ మొత్తం చెప్పేశాడు వెంక‌టేష్‌. బాల‌య్య‌కు కూడా ఈ క‌థ బాగా న‌చ్చింద‌ని స‌మాచారం. బాల‌య్య చిన్న చిన్న మార్పులు సూచించాడ‌ని తెలిసింది.

ప్ర‌స్తుతం వెంకటేష్ మహా బాలయ్య చెప్పిన మార్పులు, చేర్పులు చేస్తున్నారు. కంచ‌ర‌పాలెంలా.. ఇది కూడా ఓ వైవిధ్య‌భ‌రిత‌మైన క‌థేన‌ట‌. బాల‌య్య ఈ సినిమాని ప్ర‌యోగాత్మ‌కంగానే చేయాల‌ని భావిస్తున్నాడ‌ని స‌మాచారం. బాల‌య్య కెరీర్‌లో ఇదో కొత్త త‌ర‌హా స‌బ్జెక్ట్ అవుతుంద‌ని మ‌హా గ‌ట్టిగా న‌మ్ముతున్నాడు. అనిల్ రావిపూడి సినిమా తర్వాత అంటే వచ్చే సంవత్సరం సమ్మర్ లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. మూడు, నాలుగు నెలల్లో పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు. బాలయ్యతో సినిమా చేసే అవకాశం రావడం అంటే లక్కీ ఛాన్స్ దక్కించుకున్నట్టే. మరి.. ఈ సినిమాతో ఎంత వరకు మెప్పిస్తాడో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్