JGM: సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందుతోన్న మూవీ లైగర్. ఈ మూవీ ఆగష్టు 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే.. ఈ సినిమా విడుదల కాకుండానే విజయ్, పూరి జనగణమన అనే మూవీ చేయనున్నట్టుగా ప్రకటించారు. ఇది పూరి డ్రీమ్ ప్రాజెక్ట్. ఎప్పటి నుంచో ఈ సినిమాను చేయాలి అనుకుంటుంటే.. ఇన్నాళ్లకు సెట్ అయ్యింది.
అయితే… ఈ సినిమాను అనౌన్స్ చేసినప్పటి నుంచి అసలు జనగణమన కథ ఏంటి అనేది ఆసక్తిగా మారింది. ఇటీవల జనగణమన కథ అంటూ ఓ కథ బయటకు వచ్చింది. ఇంతకీ కథ ఏంటంటే… దేశంలో రాజకీయ వ్యవస్థలు విచ్చినం అయ్యి.. సుస్థిర ప్రభుత్వంను ఏర్పాటు చేయలేక పోతే అప్పుడు ఆర్మీ అధికారాన్ని దక్కించుకుంటుందట. ఆర్మీ ఆఫీసర్ అయిన విజయ్ దేవరకొండ ఆ సమయంలో ఎలా వ్యవహరించాడు..? ప్రభుత్వం చేతిలో ఉండగా ఆర్మీ చేసే విధులు ఏంటి? దేశాన్దేని కాపాడుకోవడంతో పాటు.. దేశ అంతర్గత విషయాలను ఎలా పరిరక్షిస్తారనేది సినిమాలో చూపించబోతున్నారని సమాచారం.
దేశవ్యాప్తంగా జనగనమణ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే.. దేశంలో ఆర్మీ పరిపాలన అనేదిసున్నితమైన అంశం కాబట్టి సినిమా విడుదల తర్వాత ఖచ్చితంగా వివాదస్పదం అవుతుందనే టాక్ వినిపిస్తోంది. మరి.. జనగణమన ఏ స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
Also Read : బోల్డ్ పిక్చర్ తో షాక్ ఇచ్చిన లైగర్