Thursday, April 25, 2024
HomeTrending Newsఈ ఒక్క ఫోటో చాలు: విజయసాయి వ్యంగ్యాస్త్రం

ఈ ఒక్క ఫోటో చాలు: విజయసాయి వ్యంగ్యాస్త్రం

Photo speaks: డీఎస్సీ-98 క్వాలిఫైడ్ అభ్యర్ధులకు న్యాయం చేస్తానంటూ పాదయాత్రలో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెరవేర్చిన సంగతి తెలిసిందే. వారి 23 ఏళ్ల పోరాటం ఫలించింది. అయితే వారిలో చాలా మంది ఇప్పుడు రకరకాల వృత్తుల్లో స్థిరపడగా మరికొందరు మాత్రం జీవనోపాధి సరిగా లేక, పెళ్ళిళ్ళు చేసుకోక ఎన్నో అవస్థలు పడుతున్నారు. అలాటి వారిలో  శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం సీది గ్రామానికి చెందిన అల్లక కేదారేశ్వర రావు కూడా ఉన్నారు. ఉద్యోగం కోసం ఎదురు చూసి  పాట సైకిల్ పై బట్టలు అమ్ముకుంటూ జీవితం మొదలు పెట్టాడు,  ఇప్పుడు అతని  వయసు 57 సంవత్సరాలు.  తాజాగా జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అతనికి కొలువు లభించింది.  మొన్నటిదాకా అతని జీవనం సాగించిన ఫోటోను, ఇప్పుడు టీచర్ జాబ్ కోసం ముస్తాబైన ఫోటోను కలిపి నాడు-నేడు తో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయి రెడ్డి ఈ ఫోటోను ట్వీట్ చేస్తూ చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

“ఈ ఒక్క ఫోటో చాలు నక్క నాయుడు జీవితాంతం కుళ్లి కుళ్లి ఏడవటానికి. ఇలాంటి కోటి మంది కళ్లల్లో వెలుగులు నింపారు జగన్ గారు. పేదల నోరుకొట్టి పెద్దోళ్లకు దోచిపెట్టిన చరిత్ర గుంట నక్కది. 1998లో డిఎస్సీలో అర్హత సాధిస్తే నియామకాలు నిలిపేసి కక్షసాధించాడు. వాళ్ల భవిష్యత్తును చిదిమేశాడు” అంటూ బాబుపై ధ్వజమెత్తారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్