Sunday, January 19, 2025
Homeసినిమాప్రేక్షకులను ఎంట‌ర్‌టైన్‌ చేసే సినిమా ‘7 డేస్ 6 నైట్స్’: సుమంత్

ప్రేక్షకులను ఎంట‌ర్‌టైన్‌ చేసే సినిమా ‘7 డేస్ 6 నైట్స్’: సుమంత్

We Entertain: మెగా మేకర్ ఎం.ఎస్. రాజు దర్శకత్వం వహించిన తాజా సినిమా ‘7 డేస్ 6 నైట్స్’. ఇందులో ఆయన కుమారుడు సుమంత్ అశ్విన్ ఒక హీరో. నిర్మాతల్లో కూడా ఆయన ఒకరు. ‘7 డేస్ 6 నైట్స్’ సినిమాను మెగా బ్యానర్ సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో సుమంత్ అశ్విన్ .ఎం, రజనీకాంత్ .ఎస్ నిర్మించారు. వైల్డ్ హనీ ప్రోడక్షన్స్, వింటేజ్ పిక్చర్స్ మరియు ఏబిజి క్రియేషన్స్ వారు చిత్రనిర్మాణంలో భాగస్వాములు. జూన్ 24న సినిమా విడుదల అవుతోంది. ఈ సందర్భంగా సుమంత్ అశ్విన్ మీడియాకి చెప్పిన విశేషాలు ఆయ‌న మాట‌ల్లోనే..

“నా కెరీర్‌లో సక్సెస్ ఫుల్ సినిమాలు ఉన్నాయి. డిజప్పాయింట్ చేసినవీ ఉన్నాయి. అయితే, ఈ జర్నీ చాలా అందంగా ఉంది. ఈ పదేళ్లు టైమ్ తెలియకుండా చాలా స్పీడుగా వెళ్ళింది. హ్యాపీగా ఉన్నాను. కొత్త నిర్ణయాలు అంటే… ఆల్రెడీ చేసిన క్యారెక్టర్స్ కాకుండా కొత్త రోల్స్, రిలేటబుల్ రోల్స్ చేయాలని ఉంది. ఇప్పటివరకు నేను చేసిన సినిమాలతో కంపేర్ చేస్తే… ఇందులో డిఫరెంట్ రోల్ చేశా. ఇంతకు ముందు చేసినవి లార్జర్ దేన్ లైఫ్ రోల్స్. ‘అంతకు ముందు ఆ తర్వాత’ సినిమాలో నా పాత్ర సహజత్వానికి దగ్గరగా ఉన్నప్పటికీ… కొన్ని అంశాలు లార్జర్ దేన్ లైఫ్ ఎలిమెంట్ ఉంటుంది.

7 Days 6 Nights

‘7 డేస్ 6 నైట్స్’లో రియాలిటీకి దగ్గరగా ఉన్న రోల్ చేశా. నాకు కూడా వన్నాఫ్ ది బెస్ట్ రోల్. ఇప్పుడు ప్రేక్షకులు కూడా డిఫరెంట్ రోల్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. కరోనా వల్ల కావచ్చు, మరొకటి కావచ్చు… ప్రేక్షకులు వరల్డ్ సినిమా చూశారు. అప్‌డేట్‌ అయ్యారు. వేరే లెవెల్‌లో ఉన్నారు. వాళ్ళకు రీచ్ అవ్వాలంటే మనం కూడా నెక్స్ట్ లెవెల్ థింగ్స్ చేయాలి. టైమ్ పట్టినా కొత్త రోల్స్ చేయాలనుకుంటున్నాను.

ఈ మూవీలో ఒక నార్మల్ యంగ్‌స్ట‌ర్‌. ఫిల్మ్ మేకర్ అవ్వాలని అనుకుంటాడు. జీవితంలో తనకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. స్ట్రగుల్ అవుతూ ఉంటాడు. ఎక్కువ స్మోక్ చేస్తాడు. వెయిట్ చేస్తాడు. తన మీద కేర్ తీసుకోడు. అటువంటి మనిషి ఎలా ఉంటాడో… నా లుక్ కూడా అలాగే ఉంటుంది. ఇదొక సింపుల్ ఫిల్మ్. ప్రేక్షకులు హ్యాపీగా ఎంట‌ర్‌టైన్‌ అయ్యే సినిమా. నిన్నే సినిమా చూశా. నేను చాలా హ్యాపీగా ఉన్నాను.

డర్టీ హరి’తో నిర్మాతలకు మంచి లాభాలు వచ్చాయి. దాని తర్వాత ఏ సినిమా చేయాలని నాన్న ఆలోచిస్తున్నారు. ఆయన దగ్గర ఆరేడు కథలు ఉన్నాయి. అందులో ఇది చేద్దామని అనుకున్నప్పుడు… నేను ప్రొడ్యూస్ చేయాలనుకున్నా. చిరంజీవి గారి దగ్గర నుంచి ఇండస్ట్రీలో చాలా మంది దర్శక, నిర్మాతలు నాన్నగారిని హానీ అని పిలుస్తారు. ‘డర్టీ హరి’, ఈ కథలు చూస్తే నాన్నగారు వైల్డ్ గా అనిపించారు. అందుకని ‘వైల్డ్ హనీ ప్రొడక్షన్స్’ అని పేరు పెట్టాను.

RELATED ARTICLES

Most Popular

న్యూస్