Weekly Horoscope in Telugu :
మేషం (Aries):
అభీష్టం నెరవేరుతుంది. వారం మొదట్లో కొన్ని చికాకులు తలెత్తినా, చేపట్టిన పనులు విజయవంతం అవుతాయి. ధనాదాయం పెరుగుతుంది. నూతన వస్తువులను సమకూర్చుకుంటారు. విందుల్లో పాల్గొంటారు. రుణదాతల ఒత్తిడి తగ్గుతుంది. శారీరక, మానసిక ప్రశాంతతను పొందుతారు. నూతన విజ్ఞానాన్ని అలవరచుకుంటారు. జీవిత భాగస్వామి తోడ్పాటుతో కుటుంబ వ్యవహారాలను చక్కబరుస్తారు. ఇతరులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. ప్రయాణాలు ఆనందాన్నిస్తాయి. ఆరోగ్యం మెరుగ్గా వుంటుంది.
వృషభం (Taurus):
పనుల పూర్తికి బాగా శ్రమించాల్సి వుంటుంది. ఆటంకాలు ఎదురైనా పనులు సఫలం అవుతాయి. అవసరానికి డబ్బు అందకపోవచ్చు. వృథా ఖర్చులుంటాయి. అత్యవసర వేళల్లో మీ తెలివితేటలు అక్కరకు రావు. నీచమైన ఆలోచనలకు దూరంగా ఉండండి. విలువైన వస్తువులు, డాక్యుమెంట్లు జాగ్రత్త. ఇతరుల వ్యవహారాల్లో అనవసరంగా జోక్యం చేసుకోకండి. వాత సంబంధ సమస్యలు వస్తాయి. వారం చివరలో బంధుమిత్రుల తోడ్పాటు లభిస్తుంది. శభ ఫలితాలు ప్రాప్తిస్తాయి. శుభ, పుణ్యకార్యాల్లో పాల్గొంటారు.
మిథునం (Gemini):
ముఖ్యమైన పనులను వారం మొదట్లోనే ప్రారంభించండి. ప్రతిపనికీ ఆటంకాలు ఏర్పడతాయి. ధైర్యం, ఆత్మవిశ్వాసాలతో ముందుకు సాగండి. డబ్బుకి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. మిత్రులు తోడుగా ఉంటారు. బంధువులతో విరోధం గోచరిస్తోంది. ఒత్తిళ్లు పెరుగుతాయి. మనసు నిలకడగా ఉండదు. కీలకమైన వ్యవహారంలో ప్రతికూల ఫలితం ఎదురవుతుంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకండి. బద్ధకాన్ని వదిలిపెట్టండి. విలువైన వస్తువుల పట్ల అజాగ్రత్తగా ఉండకండి. అనుమానాలకు దూరమైతేనే మేలు.
Weekly Horoscope in Telugu :
కర్కాటకం (Cancer):
పనుల పూర్తికి బాగా శ్రమించాల్సి వుంటుంది. ఆర్థిక అంశాలతో ముడిపడిన వ్యవహారాల్లో జాగ్రత్త. ఇతరుల జోక్యంపై ఓ కన్నేసి ఉంచండి. అనవసర విషయాల్లో తలదూర్చడం వల్ల అకారణ విరోధాలు తలెత్తుతాయి. అనుకున్నవి జరగకపోవడం వల్ల అశాంతి పెరుగుతుంది. కుటుంబంలో స్వల్ప చికాకులున్నా, సోదర వర్గం అండతో పరిష్కారమవుతాయి. మాట నిలుపుకోని కారణంగా నింద భరించాల్సి రావచ్చు. ఖర్చులు అదుపులో ఉంచండి. కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. ఆత్మీయులతో సంభాషణ ఆనందాన్నిస్తుంది.
సింహం (Leo):
అభీష్టాలు నెరవేరతాయి. తలచిన పనులను నిరాటంకంగా పూర్తిచేస్తారు. ఆర్థికంగా బాగుంటుంది. నూతన వస్తువులను కొంటారు. శారీరక, మానసిక ఆనందాన్ని పొందుతారు. ఉపయుక్త విషయాలను నేర్చుకుంటారు. కుటుంబ వాతావరణం ఆనందమయంగా ఉంటుంది. బంధువులను కలుస్తారు. విందుల్లో పాల్గొంటారు. మిత్రుల తోడ్పాటుతో కీలక సమస్యను పరిష్కరించుకుంటారు. అదృష్టం తోడవుతుంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకండి. పరువు నష్టపోయే పరిస్థితి ఉంటుంది. ఎవరికీ హామీలు ఉండకండి.
కన్య (Virgo):
అప్రమత్తంగా ఉండాలి. తలచిన పనుల పూర్తికి విపరీతంగా శ్రమించాల్సి వుంటుంది. శత్రువులు అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తారు. ఓసందర్భంలో మిత్రులే ఇబ్బంది పెడతారు. కుటుంబంలోనూ చికాకులొస్తాయి. మానసికమైన దిగులు ఆవరిస్తుంది. ధైర్యం, ఆత్మవిశ్వాసాలతో ముందుకు సాగండి. వారం మధ్యలో అదృష్టం తోడవుతుంది. బంధువులను కలిసి విందుల్లో పాల్గొంటారు. కీలకమైన బాధ్యతలనుంచి వైదొలగాల్సి రావచ్చు. ఖర్చులు అదుపుతప్పడంతో అప్పులు చేయాల్సి రావచ్చు. ప్రయాణాలు లాభించవు.
తుల (Libra):
ప్రారంభించిన పనులు విజయవంతం అవుతాయి. స్నేహితులు తోడుగా నిలుస్తారు. ఇతరుల నుంచీ సహాయ సహకారాలు అందుతాయి. అవసరానికి సరిపడా డబ్బు సమకూరుతుంది. అప్పులు చెల్లించే ప్రయత్నాలు ఫలిస్తాయి. మంచి సౌకర్యాలు సమకూర్చుకుంటారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. శారీరక, మానసిక సౌఖ్యాన్ని పొందుతారు. శుభకార్యాలు నిర్వహిస్తారు. సంతాన సంబంధ వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. ఖర్చులు అదుపు చేయాలి. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకండి. అత్యవసర వేళ అదృష్టం తోడవుతుంది.
Weekly Horoscope in Telugu :
వృశ్చికం (Scorpio):
మేలమి కాలం నడుస్తోంది. అన్నింటా విజయాన్ని పొందుతారు. అవసరానికి సరిపడా డబ్బు సమకూరుతుంది. బంధువులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. అధికారులు, పెద్దల ఆదరాభిమానాలు పొందుతారు. ఆత్మవిశ్వాసం, స్థిరనిర్ణయంతో తీసుకునే నిర్ణయాలు చక్కటి ప్రయోజనాలనిస్తాయి. బాధ్యతలు పెరుగుతాయి. ఇంట్లో శాంతి నెలకొంటుంది. కొత్త స్నేహాలు లాభదాయకంగా ఉంటాయి. శారీరక, మానసిక ఆనందం లభిస్తుంది. వారాంతంలో ఖర్చులు అదుపు చేయాలి. ఇతరులతో జాగ్రత్తగా ఉండాలి.
ధనస్సు (Sagittarius):
యోగదాయకమైన కాలం. అభీష్టాలు నెరవేరతాయి. ఆర్థిక సమస్యలు ఓకొలిక్కి వస్తాయి. విభేదాలు, విరోధాలు మీకు అనుకూలంగా ముగుస్తాయి. అప్పులు చెల్లించే మార్గాలు కనిపిస్తాయి. స్థిర నిర్ణయంతో అన్ని పనుల్లో విజయాలు లభిస్తాయి. అధికారులు, పెద్దల ఆదరాభిమానాలను పొందుతారు. అవకాశాలను చేజార్చుకోకండి. బంధువులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. ఇంట్లో శాంతి నెలకొంటుంది. కొత్త స్నేహాలు ఏర్పడతాయి. నూతన సౌకర్యాలు సమకూర్చుకుంటారు. సంతాన సంబంధ విషయాలు ఆనందాన్నిస్తాయి.
మకరం (Capricorn):
ప్రారంభంలో స్వల్ప ఒడుదుడుకులు ఎదురైనా కార్యాలన్నింటా విజయాన్ని అందుకుంటారు. అభీష్టాలు నెరవేరతాయి. ఇతరులతో విభేదాలు తలెత్తినా, మీకు అనుకూలంగానే పరిష్కారం అవుతాయి. అధికారులు, పెద్దల ఆదరాభిమానాలు పొందుతారు. అవసరానికి సరిపడా డబ్బు సమకూరుతుంది. బంధువులతో విందుల్లో పాల్గొంటారు. వ్యక్తిగత గౌరవ మర్యాదలతో పాటు బాధ్యతలు పెరుగుతాయి. శత్రువులపై కన్నేసి ఉంచండి. ఇంట్లో శాంతి నెలకొంటుంది. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు.
కుంభం (Aquarius):
పనుల పూర్తికి విపరీతంగా శ్రమించాల్సి వుంటుంది. అవసరానికి సరిపడా డబ్బు సమకూరుతుంది. నూతన విజ్ఞానాన్ని పొందే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రులను కలుస్తారు. విందుల్లో పాల్గొంటారు. కుటుంబ సమస్యల పరిష్కారంలో జీవిత భాగస్వామి తోడ్పాటు లభిస్తుంది. శారీరక, మానసిక శాంతిని పొందుతారు. భవిష్యత్ ప్రణాళికలు రచిస్తారు. ప్రయాణాలు ఆనందాన్నిస్తాయి. ఖర్చులు అదుపు చేయాలి. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకండి. ఉద్రేకానికి దూరంగా ఉండండి. జీర్ణ సంబంధ సమస్యలుంటాయి.
మీనం (Pisces):
తలచిన పనులు నెరవేరతాయి. అన్నింటా విజయం లభిస్తుంది. డబ్బుకి ఇబ్బంది తొలగుతుంది. వస్తు, వాహన సౌఖ్యాన్ని పొందుతారు. విందుల్లో పాల్గొంటారు. బంధుమిత్రులు సహకరిస్తారు. జీవిత భాగస్వామితో సమాలోచనల వల్ల కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. శారీరక, మానసిక శాంతిని పొందుతారు. ప్రయాణాలు ఆనందకరంగా సాగుతాయి. వారం చివరలో ఖర్చులు అదుపు చేయాలి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం వద్దు. పెద్దలు, అధికారుల ఆగ్రహానికి గురికావచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి.
గమనిక :
జన్మరాశిని అనుసరించి ఈ ఫలితాలు చూసుకోవాలి. ఇవి, గోచార గ్రహాల సంచారాన్ని బట్టి నిర్ణయించిన స్థూల ఫలితాలు. వ్యక్తిగత జాతక ఫలితాలు తెలుసుకో దలచిన వారు, తమ జన్మ వివరాలు (పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు) దిగువ సూచించిన మెయిల్ ఐడీకి పంపగలరు.
శుభం భూయాత్
పి.విజయకుమార్
[email protected]

జర్నలిజంలో 30 సంవత్సరాలకు పైబడిన అనుభవం.. 15 సంవత్సరాలకు పైగా జోతిష శాస్త్రంలో అధ్యయనం.