Sunday, January 19, 2025
HomeTrending Newsవెధవల్లారా...:  వైసీపీ నేతలపై పవన్ నిప్పులు

వెధవల్లారా…:  వైసీపీ నేతలపై పవన్ నిప్పులు

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వైఎస్సార్సీపీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులపై నిప్పులు చెరిగారు. అరేయ్, వెధవల్లారా, సన్నసుల్లారా… అంటూ పరుష  పదజాలంతో విరుచుకు పడ్డారు. తనను ఇంకోసారి ప్యాకేజీ స్టార్ అంటే ఒంటి చేత్తో పీక పిసికి చంపేస్తా అంటూ హెచ్చరించారు. చెప్పుతో కొడతా అంటూ తన కాలి చెప్పును పైకి చూపించి తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ఇకపై తన రాజకీయం ఏంటో చూపిస్తానని, వైసీపీతో యుద్ధానికి సిద్ధం అంటూ ప్రకటించారు. ‘రాడ్ లతోనా, హాకీ స్టిక్కులతోనా, దేనితోనైనా తేల్చుకుందాం రండి’ అంటూ సవాల్ చేశారు. ‘పోనీలే అని ఇన్నాళ్ళూ వూరుకున్నా, బూతులు తిట్టే ప్రతి ఒక్కరినీ నిల్చోబెట్టి తోలు వలుస్తా కొడకల్లారా’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

గత 8 ఏళ్ల కాలంలో  తాను ఆరు సినిమాలు చేశానని, రూ.100 కోట్ల నుంచి రూ.120 కోట్లు సంపాదించానని, 33.37 కోట్లు ట్యాక్స్ కట్టానని వెల్లడించారు. వైసీపీ గుండాలు మర్యాదగా ఉంటే మేము మర్యాదగా ఉంటామని, వాళ్ళు దాడులు చేతే మేమూ చేస్తామన్నారు. మూడు పెళ్ళిళ్ళపై కూడా తనను విమర్శిస్తున్నారని, కావాలంటే మీరు కూడా చేసుకోండని వ్యాఖ్యానించారు. ఒక పెళ్లి చేసుకొని 30 మంది స్టెఫినీలతో తిరిగే మీరా నాకు చెప్పేది అని నిలదీశారు.

వైసీపీలో ఉన్న కాపు మంత్రులు ఎమ్మెల్యేలపై కూడా పవన్ తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. ‘బంతి, కొట్టు సన్నాసుల్లారా, తనను గొడవల్లోకి లాగితే పీక పిసికి చంపుతా’ అంటూ ఫైర్ అయ్యారు. నోరు జారితే తోలు తీస్తానన్నారు. ‘ వైసీపీలో ఉన్న వెధవ వాగుళ్ళు వాగే కాపు ఎమ్మెల్యేలకు చెబుతున్నా…పిచ్చి వాగుడు వాగాకండి, మీ వెంట మీ కులం రాదు, జగన్ ను తిడితే తిట్టుకోండి, కానీ కులాన్ని కించపరచొద్దు’ అంటూ వార్నింగ్ ఇచ్చారు.  ఇంతకాలం తన సహనం మిమ్మల్ని రక్షించిందనీ, ఇకపై వారి ఆటలు సాగబోవని, ఇకపై తాము కార్యరంగంలోనే ఉండి తేల్చుకుంటామన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో జనసేన జెండా ఎగరేస్తామని, తెలంగాణాలో 7నుంచి 14ఎమ్మెల్యే స్థానాలు, రెండు ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తామని వెల్లడించారు.

Also Read సవాళ్ళకు సిద్ధం : పవన్ కళ్యాణ్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్