Tuesday, June 9, 2026
HomeTrending Newsకేసిఆర్ ముందు మీరెంత? ప్రశాంత్ రెడ్డి

కేసిఆర్ ముందు మీరెంత? ప్రశాంత్ రెడ్డి

పిసిసి అధ్యక్షుడు ఏ. రేవంత్ రెడ్డి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లు ముఖ్యమంత్రి కేసిఆర్ కాలిగోటికికూడా సరిపోరని రాష్ట్ర రోడ్లు, భవనాలు; అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. ప్రతిరోజూ సిఎం కెసియార్ పై  అసత్యపు అరోపణలు చేయడమే పనిగా పెట్టుకున్నారని, ఇది మానుకోకపోతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అయన హెచ్చరించారు.

ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్ళివచ్చిన తరువాత రేవంత్ మతి భ్రమించిందని, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని విమర్శించారు.  రేవంత్ కు దమ్ము దైర్యం ఉంటే డ్రగ్స్ విషయంలో కేటిఆర్ చేసిన సవాలు స్వీకరించాలని సూచించారు. ఢిల్లీ వెళ్లి తమ నేత రాహుల్ గాంధీని ఒప్పించి టెస్టుల కోసం ఎయిమ్స్ కి రావాలని చాలెంజ్ చేశారు.

బండి సంజయ్ కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షునిగా ఉండి కూడా స్థాయి మరిచి మాట్లాడుతున్నారని ప్రశాంత్ రెడ్డి ధ్వజమెత్తారు.  కేసిఆర్ ని జైలుకు పంపుతామని మూడేళ్ళ నుంచీ చెబుతున్న సంజయ్ ఇప్పటివరకూ ఓ చిన్న ఆరోపణ కూడా రుజువు చేయలేకపోయారని ఎద్దేవా చేశారు.  ఈ ఇద్దరు నేతలు ఇకనైనా పద్ధతిగా రాజకీయాలు చేయాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి హితవు పలికారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular