Saturday, September 28, 2024
Homeసినిమాఏపీలో మొదటి మొబైల్ సినిమా ధియేటర్

ఏపీలో మొదటి మొబైల్ సినిమా ధియేటర్

Mobile Theatre:  ఒకప్పుడు సినిమా థియేటర్ లేని ఊళ్లలో  ఒక చోట తెర, ప్రొజెక్టర్  ఏర్పాటు చేసి సినిమా ప్రదర్శించేవారు. ఈ వస్తువులను ఒక మొబైల్ వాన్ లో వేసుకొని రోజుకో వూళ్ళో సినిమా ప్రదర్శించేవారు. మరికొన్ని ఊళ్లలో టూరింగ్ టాకీస్ లు ఉండేవి.

ఇప్పుడు ఆధునిక సౌకర్యాలు, ఏసీ థియేటర్లు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో నాటి పాత ప్రొజెక్టర్ పద్ధతిని తలపించేలా,  సరికొత్త ఐడియాతో మొబైల్ సినిమా హాల్ ఏర్పాటుకు పిక్చర్ డిజిటల్స్ సంస్థ  శ్రీకారం చుట్టింది.

ఇది ట్రక్కులో ఎక్కడికైనా తీసుకుపోయి అమర్చుకోగల మొబైల్ సినిమా హాల్. రాజానగరం వద్ద నేషనల్ హైవే పక్కన హాబిటేట్ ఫుడ్ కోర్టు ప్రాంగణంలో ఈ థియేటర్ ఏర్పాటౌతోంది. వెదర్ ప్రూఫ్, ఫైర్ ఫ్రూఫ్ పద్ధతుల్లో వేసిన టెంట్ లో గాలినింపే టెక్నాలజీతో 120 సీట్ల కెపాసిటీతో ఈ ఏసి ధియేటర్ ను రూపొందిస్తున్నారు.

“పిక్చర్ డిజిటల్స్” సంస్ధ ఆంధ్రప్రదేశ్ లో నెలకొల్పుతున్న మొబైల్ ధియేటర్లలో ఇది మొదటిదని,  మెగా స్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమాతో దీన్ని ప్రారంభిస్తామని సంస్ధ ప్రతినిధి చెప్పారు.

నాటి టూరింగ్ టాకీసులకు లేటెస్ట్ వెర్షన్ గా  దీన్ని భావించవచ్చు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్