Saturday, November 23, 2024
Homeసినిమా అంగరంగ వైభవంగా "ఆర్గానిక్ మామ.. హైబ్రీడ్ అల్లుడు" ఆరంభం

 అంగరంగ వైభవంగా “ఆర్గానిక్ మామ.. హైబ్రీడ్ అల్లుడు” ఆరంభం

Organic Mama: కుటుంబం అంతా కలిసి చూసేలా ఎన్నో ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ వంటి సూపర్ డూపర్  హిట్ చిత్రాలను రూపొందించి ప్రేక్షకుల్లో తనకంటూ ఒక సపరేట్ బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకున్నదర్శకుడు ఎస్వీ. కృష్ణారెడ్డి. చాలా కాలం గ్యాప్ తర్వాత ఆయన మెగా ఫోన్ పట్టి నేటి ట్రెండ్ కి తగ్గట్లుగా ‘ఆర్గానిక్ మామ.. హైబ్రీడ్ అల్లుడు’ వంటి వైవిధ్యమైన టైటిల్ తో అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటెర్టైనెర్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ హీరోగా, మజిలీ ఫేమ్ అనన్య హీరోయిన్ గా అమ్ము క్రియేషన్స్ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ కల్పన చిత్ర పతాకం పై కోనేరు కల్పన ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్, కుష్భు, ఆలీ, సునీల్, వరుణ్ సందేశ్, రష్మీ, హేమ, అజయ్ గోష్, రాజా రవీంద్ర వంటి ఎందరో ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో సినీ ప్రముఖుల మధ్య అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమాల అనంతరం నటకిరీటి డాక్టర్ రాజేంద్రప్రసాద్, హీరో సోహైల్ హీరోయిన్ అనన్య లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి సెన్షేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ క్లాప్ నివ్వగా ప్రముఖ నిర్మాత కె.అచ్చిరెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు.

నటకిరీటి డా. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. “కృష్ణారెడ్డి నాతో  కొబ్బరి బొండాం, రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు, వంటి సూపర్ హిట్ చిత్రాలను తీశారు. ఆ చిత్రాలు ఇప్పటికీ టీవీలో వచ్చినప్పుడల్లా ప్రేక్షకుల‌ను అలరిస్తాయి. ఎంతో మంది ఫోన్స్ చేసి అభినందిస్తుంటారు. ఎన్నో చక్కని పాత్రలు రాసి నటుడిగా నన్ను బ్రతికుండేలా చేసిన ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు. మళ్ళీ చాలా కాలం తర్వాత ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో నటిచడం చాలా హ్యాపీగా వుంది. కుటుంభం అంతా కలిసి ఎంజాయ్ చేసేలా నేటి ట్రెండ్ కి తగ్గట్లుగా ఈ చిత్రం ఉంటుంది. కామిడీ, సెంటిమెంట్, ఎమోషన్స్ అన్నీ ఈ చిత్రంలో ఉంటాయి. చాలా రోజుల తర్వాత ఫామిలీ ఆడియెన్స్ అంతా కలిసి చూసే ఒక చక్కని సినిమా రాబోతుంది. వందశాతం ఈ సినిమాని  ప్రతి ఒక్కరూ హాయిగా నవ్వుకొని ఎంజాయ్ చేసేలా ఉంటుంది అన్నారు.

చిత్ర దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. దాదాపు ఆరేళ్ళ గ్యాప్ తర్వాత ఈ సినిమా చేస్తున్నాను. చాలా మంది కలిసినప్పుడల్లా మీ మార్క్ కామిడీ చిత్రాలు రావటం లేదు. అలాంటి సినిమాలు చూసి చాలా కాలం అయింది అని అంటున్నారు. నాకు అదే ఫీలింగ్ కలిగింది. అప్పటి నుండి మంచి కథలు రాసుకుంటూ సరైన ప్రొడ్యూసర్ కోసం వైట్ చేశాను. అచ్చిరెడ్డి గారి సలహా మేరకు కల్పన గారు ఈ సినిమా చేయడానికి ముందుకొచ్చారు. ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా ఆర్టిస్టుల్ని,టెక్నీషియన్స్ ని అందర్నీ ప్రొవైడ్ చేసి ఈ చిత్రాన్ని చాలా గ్రాండ్ గా నిర్మించడానికి ప్లాన్ చేసారు. అలాగే  సి.కళ్యాణ్ గారు దగ్గరుండీ ఈ ఓపెనింగ్ గ్రాండ్ గా ఆర్గనైజ్ చేయడం చాలా సంతోషం అనిపించింది. ఆయనది వెరీ గుడ్ అండ్ బిగ్ హ్యాండ్. చాలా గొప్పగా కళ్యాణ్ ఈ ఓపెనింగ్ జరపడం నేను ఎప్పటికీ మర్చిపోలేను.

సోహైల్, అనన్య చక్కగా సెట్ అయ్యారు. అలాగే వరుణ్ సందేశ్ ఒక గెస్ట్ పాత్ర చేస్తున్నాడు. అఖండ వంటి బిగ్ హిట్ తరువాత  రాంప్రసాద్ మా సినిమాకి ఫోటోగ్రఫీ అందిస్తున్నారు. అలాగే సునీల్ ఫోన్ లో క్యారెక్టర్ చెప్పగానే నేను చేస్తున్నాను సార్ అన్నాడు. అలాగే ఎంతోమంది ఈ ప్రారంబోత్సవానికి వచ్చి వారి బ్లెస్సింగ్స్ ఇవ్వడం నేను దీవెనులుగా భావిస్తున్నాను. నేను అమెరికాలో ఒక ఇంగ్లిష్ ఫిలిం చేశాను. అక్కడ మూడేళ్లు పట్టింది ఆ సినిమా చేయడానికి. నాకు అక్కడ వుండబుద్ది కాలేదు. మళ్ళీ మన తెలుగు సినిమాలు చేయాలనీ ఇక్కడికి వచ్చాను. తెలుగు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడు మనసుకి నిండుగా తృప్తిగా ఉంటాయి. అవే కావాలని కోరుకుని ఈ సినిమా స్టార్ట్ చేయడం జరిగింది అన్నారు.

Also Read : ‘ఎఫ్3’ సెకండ్ సింగిల్ రెడీ

RELATED ARTICLES

Most Popular

న్యూస్