కొద్ది రోజులుగా వివాదాస్పందంగా ఉన్న వీఆర్ఓ ల వ్యవహారం ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. వీఆర్ఓ లను వివిధ శాలకు కేటాయింపు ప్రక్రియ విజయవంతంగా జరిగింది. మొత్తం 98 శాతం మంది వీఆర్ఓ లు తమకు కేటాయించిన శాఖల్లో జాయిన్ అయ్యారు. రాష్ట్రంలో మొత్తం 5137 వీఆర్ఓ లుండగా వారిని వివిధ ప్రభత్వ శాఖలకు కేటాయించగా గురువారం వరకు 5014 మంది తమకు కేటాయించిన శాఖల్లో జాయిన్ అయ్యారు.
కాగా ప్రభుత్వ ఉత్తర్వు 121 ను సవాలు చేస్తూ 19 మంది కోర్టుకు వెళ్లినప్పటికీ కేవలం ఈ 19 మందికి మాత్రం స్టేటస్ కో ను కోర్టు ఇచ్చింది. అయితే, ఈ 19 మందిలోనూ దాదాపు 15 మంది వీఆర్ఓ లు తమకు కేటాయించిన శాఖల్లో జాయిన్ అయినట్టు సమాచారం. ఈ అంశంపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. రెవిన్యూ శాఖలో వీఆర్ఓ లను ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగించేది లేదని, తప్పని సరిగా వారికి కేటాయించిన శాఖల్లో జాయిన్ కావాల్సిందేనని నిన్న జరిగిన సమావేశంలో మరోసారి స్పష్టం చేసినట్టు తెలిసింది.
ఎవరైనా వీఆర్ఓ లు స్వచ్ఛంద పదవీ విరమణ చేయాలనుకుంటే, నిబంధనల మేరకు వారికి అనుమతి నివ్వాలని కూడా నిర్ణయించినట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం.
Also Read : సిఎం హామీలు నీటి మూటలు పొన్నం విమర్శ