Sunday, November 24, 2024
HomeTrending Newsపర్యాటక కేంద్రంగా రంగనాయక సాగర్‌ : హరీశ్‌రావు

పర్యాటక కేంద్రంగా రంగనాయక సాగర్‌ : హరీశ్‌రావు

రంగనాయక్‌ సాగర్‌ ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్ధిపేట పట్టణ శివారు ఎల్లమ్మ ఆలయం వద్ద నుంచి ఇల్లంతకుంట రోడ్డు విస్తరించనున్నారు. మొదటి విడుతలో రూ.66కోట్ల వ్యయంతో మొదటి విడతగా సిద్ధిపేట నుంచి చిన్నకోడూరు వరకు 10 నాలుగు లైన్ల రహదారి నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అలాగే రంగనాయక్‌ సాగర్‌ నుంచి ఎడమ కాలువ ద్వారా పంట పొలాలకు నీటిని విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. నిత్యం ట్రాఫిక్ పెరుగుతున్న దృష్ట్యా ప్రజా సౌకర్యార్థం రహదారి విస్తరణ చేపడుతున్నామన్నారు. సిద్ధిపేట చుట్టూ నలువైపులా నాలుగు లైన్ల రహదారి పనులు జరుగుతున్నాయన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేక ఇవన్నీ జరుగుతున్నాయన్నారు. రంగనాయక సాగర్ నుంచి నీరు వదలాలని రైతుల కోరిక మేరకు నీరు వదులుతున్నామన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు కాళేశ్వరం నీళ్లతో ఎకరం భూమి పారలేదని మాట్లాడుతున్నారని, ప్రతిపక్ష నేతలు రైతుల పంట పొలాల్లో నీరు పారుతుంటే వారికి కండ్లు ఉండి చూడలేకపోతున్నారని విమర్శించారు. కాళేశ్వరం ఫలితమేంటో గ్రామాలకు వచ్చి పారే నీళ్లను చూస్తే తెలుస్తుందన్నారు. సీఎం కేసీఆర్‌ రైతుల పంటలకు నీళ్లు అందించాలని తమకు అవకాశం ఇచ్చారన్న మంత్రి.. చివరి రైతు వరకూ నీరు అందించేలా అధికారులు చొరవ చూపాలన్నారు. ఎడమ కాలువ ద్వారా ఎడమ కాలువ ద్వారా మొదటి విడత 100 క్యూసెక్కులు, రెండో విడతలో 300 క్యూసెక్కులు విడుదల చేయనున్నారు. నారాయణరావుపేట – చిన్నకోడూర్ మండలాల్లోని పలు గ్రామాలు కలుపుకుని మొత్తం 512 క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

నారాయణరావుపేట మండలం పరిధిలో చెరువులు, చెక్ డ్యాములు, కుంటలు, వాగులు, వంకల ద్వారా 2,840 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనున్నదని చెప్పారు. రంగనాయక సాగర్ ఎడమ కాలువ కింద నారాయణరావుపేట, చిన్నకోడూర్ మండలాలు కలుపుకుని ప్రధాన కాలువ, డిస్ట్రిబ్యూటరీ కెనాల్ పూర్తయినట్లు, మైనర్ కెనాల్, సబ్ మైనర్ కెనాల్, పంట కాల్వల ద్వారా మొత్తం 70వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించనున్నట్లు మంత్రి వివరించారు. ఇటీవల పలు గ్రామాల రైతులు మంత్రిని కోరిన దరిమిలా చెరువులు, కుంటలు, వాగులు, వంకలను గోదావరి జలాలను విడుదల చేయాలని ఆయా గ్రామ రైతుల కోరిక మేరకు ఆ నీటిని విడుదల చేస్తున్నట్లు మంత్రి హరీశ్ తెలిపారు.

Also Read : రైతు శ్రేయస్సు కోసం అహర్నిశలు కృషి : మంత్రి హరీశ్‌రావు

RELATED ARTICLES

Most Popular

న్యూస్