Sunday, November 24, 2024
HomeTrending NewsTPCC: కాంగ్రెస్ ఆధ్వర్యంలో దశాబ్ది దగా...

TPCC: కాంగ్రెస్ ఆధ్వర్యంలో దశాబ్ది దగా…

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల పేరుతో బిఆర్ఎస్ ప్రభుత్వ నిధులు వెచ్చిస్తూ పార్టీ ప్రచార కార్యక్రమాలు చేపడుతోందని కాంగ్రెస్ ఘాటుగా విమర్శించింది. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను దశాబ్ది దగా పేరుతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వంపై నిరసన కార్యక్రమాలు చేపట్టాలని తెలంగాణ పిసిసి పిలుపు ఇచ్చింది. ఈ మేరకు ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే అధ్యక్షతన జరిగిన రాజకీయాల వ్యవహారాల కమిటీ (పిఏసీ) లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సూచన మేరకు నిర్ణయించారు.

ఈ రోజు ( 22వ తేదీన) అన్ని నియోజక వర్గ కేంద్రాలలో దశాబ్ది దగా పేరుతో కేసీఆర్ దిష్టి బొమ్మ ను రావణ సురుడిలాగా తయారు చేసి పది తలలు ఏర్పాటు చేసి తలలకు ప్రభుత్వ వైఫల్యాలను రాసి భారీ ప్రదర్శన తీసి దగ్ధం చెయ్యాలి. అనంతరం ఆర్.డి. ఓకు గాని, ఎమ్మార్వో కు గాని వినతి పత్రాలు అందించాలి.

ఈ కార్యక్రమాలు చాలా పెద్దఎత్తున చేపట్టాలి. ఆయా పథకాల బాధిత ప్రజలు ఆ నిరసన ప్రదర్శనలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలి. నియోజకవర్గంలోని నాయకులంతా ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేలా కృషి చేయాలని పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ గౌడ్ పిలుపు ఇచ్చారు.

ప్రభుత్వ వైఫల్యాలు
1. కేజీ నుంచి పీజీ ఉచిత నిర్బంధ విద్య
2.ఫీజ్ రీయంబర్స్ మెంట్
3.ఇంటికో ఉద్యోగం
4. నిరుద్యోగ భృతి
5.పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు
6.దళిత కుటుంబాలకు మూడు ఎకరాల భూమి
7.పోడు భూములకు పట్టాలు
8. రైతు రుణ మాఫీ
9. 12 శాతం ముస్లిం రిజర్వేషన్లు
10. 12 శాతం గిరిజన రిజర్వేషన్లు

RELATED ARTICLES

Most Popular

న్యూస్