Sunday, January 19, 2025
Homeసినిమాఆలోచ‌న‌లో ప‌డ్డ నాగ‌చైత‌న్య‌

ఆలోచ‌న‌లో ప‌డ్డ నాగ‌చైత‌న్య‌

అక్కినేని నాగ‌చైత‌న్య న‌టించిన థ్యాంక్యూ  ఇటీవ‌ల రిలీజైంది. మ‌నం ఫేమ్ విక్ర‌మ్ కుమార్ డైరెక్ష‌న్ లో రూపొందిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. జోష్ చిత్రాన్ని నిర్మించిన దిల్ రాజు నాగ‌చైత‌న్య‌తో చాలా సంవ‌త్స‌రాల త‌ర్వాత సినిమా నిర్మించ‌డంతో ఈసారి ఖ‌చ్చితంగా స‌క్సెస్ సాధిస్తుందనుకున్నారు. ఊహించ‌ని విధంగా థ్యాంక్యూ డిజాస్ట‌ర్ అయ్యింది. ఫ‌స్ట్ డే మ్యాట్నీ నుంచే క‌లెక్ష‌న్స్ లేని ప‌రిస్థితి.

ఇది దిల్ రాజుకు పెద్ద షాక్ అని చెప్ప‌చ్చు. ఈమూవీ రిజెల్ట్ తో నాగ‌చైత‌న్య ఆలోచ‌న‌లో ప‌డ్డార‌ట‌. క‌థ విష‌యంలో మ‌రింత కేర్ తీసుకుంటున్నార‌ట‌. ప్ర‌స్తుతం త‌మిళ డైరెక్ట‌ర్ వెంక‌ట్ ప్ర‌భుతో ఓ భారీ చిత్రం చేస్తున్నారు. ఇది తెలుగు, త‌మిళ్ లో రూపొందుతోంది. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతుంది. త్వ‌ర‌లో సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతుంది. ఇందులో నాగ‌చైత‌న్య ప‌వ‌ర్ ఫుల్ పోలీసాఫీస‌ర్ గా న‌టిస్తున్నాడు.

అయితే.. థ్యాంక్యూ ఎఫెక్ట్ తో ఈ క‌థ పై మ‌రోసారి వ‌ర్క్ చేయ‌మ‌ని.. వెంక‌ట్ ప్ర‌భుకి చెప్పాడ‌ట‌. వెంక‌ట్ ప్ర‌భు ఈ స్క్రిప్టుపై మ‌రోసారి వ‌ర్క్ చేస్తున్నార‌ని తెలిసింది. అలాగే ప‌ర‌శురామ్ తో చేయ‌నున్న మూవీ విష‌యంలో కూడా చాలా కేర్ తీసుకుంటున్నాడ‌ట‌. ఈసారి ప‌క్కా హిట్ కొట్టాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్నాడ‌ట చైతూ. ఈ రెండు సినిమాలు త‌ప్ప మ‌రో సినిమా గురించి ఆలోచించ‌డం లేద‌ట‌.

Also Read : ‘థ్యాంక్యూ’ ఎఫెక్ట్ ప‌ర‌శురామ్ పై ప‌డిందా? 

RELATED ARTICLES

Most Popular

న్యూస్