Sunday, January 19, 2025
Homeసినిమా‘అల్లూరి’ గొప్ప స్ఫూర్తినిచ్చే చిత్రం : శ్రీవిష్ణు

‘అల్లూరి’ గొప్ప స్ఫూర్తినిచ్చే చిత్రం : శ్రీవిష్ణు

శ్రీవిష్ణు న‌టించిన‌ ప్రతిష్టాత్మక చిత్రం ‘అల్లూరి‘.  ప్రదీప్ వర్మ  ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. లక్కీ మీడియా బ్యానర్ పై బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తుండగా, బెక్కెం బబిత సమర్పిస్తున్నారు. సెప్టెంబర్ 23న ప్రపంచ వ్యాప్తంగా అల్లూరి విడుదల కానుంది.

శ్రీవిష్ణు మాట్లాడుతూ “కృష్ణ గారి సినిమా అల్లూరి సీతారామారాజు క్లైమాక్స్ లో ‘ఒక అల్లూరి చనిపోతే వంద మంది అల్లూరిలు పుడతారని’ చెప్తారు. ఆ వందమందిలో మా అల్లూరి ఒకరు. (నవ్వుతూ). ఇదొక పోలీస్ స్టొరీ. అల్లూరి అనే ఫిక్షనల్ పాత్ర తీసుకొని కొన్ని యాధార్ధంగా జరిగిన సంఘటనలు ఆధారంగా తీర్చిదిద్దాం. ఒక పోలీస్ విధుల్లో  చేరినప్పటి నుండి 15 ఏళ్ల సర్వీస్ లో ఏం చేశాడనేది ఒక అద్భుతమైన టైమ్ లైన్ ఇందులో చూపించబోతున్నాం.

దర్శకుడు ప్రదీప్ వర్మ పూర్తి కథతో నా దగ్గరరికి వచ్చారు. ఈ కథలో సంఘటనలు నిజంగా జరిగినవేనని సినిమా చేస్తున్న క్రమంలో ఒకొక్కటిగా తెలిసింది. ఈ కథ విన్నపుడు పోలీస్ వ్యవస్థలో ఇంత డెప్త్ ఉందా అనిపించింది. ఎలాంటి పరిస్థితిలోనైనా నిజాయితీగా ఉంటూ విధిని నిర్వహించే ఓ పోలీస్ కథ ఇది. వ్యవస్థలో మంచి చెడులు ఇందులో చూపిస్తాం. చెడుకి పరిష్కారం కూడా చూపిస్తాం. కొంతమంది ప్రముఖ పోలీస్ అధికారుల స్ఫూర్తితో వున్న సంఘటనలు వుంటాయి.

అయితే ఇందులో ఎవరి పేర్లని తీసుకోలేదు. మొత్తం ఒక వ్యవస్థగా చెప్పాం. అలాగే పోలీసు డ్యూటీ మొదలుపెట్టినపుడు చాలా ఆవేశం వుంటుంది. కానీ పోలీసు విధిని రాముడిలా నిర్వర్తించాలి. అల్లూరి పాత్ర ప్రయాణంలో ఆ మార్పుని ప్రేక్షకులు గమనిస్తారు. ఇందులో నా పాత్ర కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నా. డిఫరెంట్ టైమ్స్ లో డిఫరెంట్ గా కనిపించాలి. ఆ లక్స్ అన్నీ నేచురల్ గా కనిపిస్తాయి. ఒక్క మాట‌లో చెప్పాలంటే.. అల్లూరి గొప్ప స్పూర్తినిచ్చే చిత్రం” అన్నారు.

Also Read: శ్రీవిష్ణు అల్లూరి ట్రైలర్‌ను లాంచ్ చేసిన నాని

RELATED ARTICLES

Most Popular

న్యూస్