Sunday, January 19, 2025
Homeసినిమావాల్తేరు వీర‌య్య‌కు షాక్ ఇచ్చిన ర‌వితేజ‌?

వాల్తేరు వీర‌య్య‌కు షాక్ ఇచ్చిన ర‌వితేజ‌?

మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబ‌ర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత స్పీడు పెంచి వ‌రుస‌గా సినిమాలు చేస్తున్నారు. గాడ్ ఫాద‌ర్, భోళా శంక‌ర్, వాల్తేరు వీర‌య్య సినిమాలు షూటింగ్ ద‌శ‌లో ఉన్నాయి. వెంకీ కుడుముల‌, మారుతితో సినిమాలు చ‌ర్చ‌ల ద‌శ‌లో ఉన్నాయి. గాడ్ ఫాద‌ర్ ద‌స‌రాకి, వాల్తేరు వీర‌య్య సంక్రాంతికి రానున్న‌ట్టుగా ప్ర‌క‌టించారు. దీంతో ఈ రెండు సినిమాల కోసం మెగా అభిమానులు ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు.

అయితే… వాల్తేరు వీర‌య్య సినిమా ప‌క్కా మాస్ మూవీ. దీంతో ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ రావ‌డంతో అంచ‌నాలు భారీగా ఉన్నాయి. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే.. వాల్తేరు వీర‌య్య సినిమాలో మాస్ మ‌హారాజా ర‌వితేజ కీల‌క పాత్ర చేయ‌నున్న‌ట్టుగా వార్త‌లు వ‌చ్చాయి. గ‌తంలో చిరంజీవితో ర‌వితేజ అన్న‌య్య సినిమాలో న‌టించారు. చాలా గ్యాప్ త‌ర్వాత వీరద్ద‌రూ క‌లిసి న‌టించ‌నున్నార‌ని టాక్ రావ‌డంతో వాల్తేరు వీర‌య్య మ‌రింత క్రేజ్ ఏర్ప‌డింది.

అయితే.. ఇప్పుడు ర‌వితేజ ఈ సినిమాలో న‌టించ‌డం లేద‌ట‌. వేరే సినిమాల్లో బిజీగా ఉండ‌డంతో నో చెప్పాడ‌ట‌. సంక్రాంతికి వ‌స్తున్నామ‌ని అనౌన్స్ చేసిన త‌ర్వాత ఊహించ‌ని విధంగా ర‌వితేజ నో చెప్ప‌డంతో టీమ్ టెన్ష‌న్ పడుతున్నార‌ట‌. ఇప్పుడు ర‌వితేజ క్యారెక్ట‌ర్ ను ఎవ‌రితో చేయించాల‌ని ఆలోచిస్తున్నార‌ట మేక‌ర్స్. కొన్ని ప్రముఖ పేర్లను ఈ సినిమా కోసం పరిశీలిస్తున్నారు డైరెక్టర్ బాబీ. మరి.. ర‌వితేజ క్యారెక్ట‌ర్ ను ఎవ‌రు చేస్తారో..?  చూడాలి.

Also Read : వాల్తేరు వీర‌య్య ఎంతవ‌ర‌కు వ‌చ్చాడు? 

RELATED ARTICLES

Most Popular

న్యూస్