Saturday, January 18, 2025
Homeసినిమా'అందరూ బాగుండాలి.. అందులో ఆలీ కూడా ఉండాలి' - ఎస్‌.వి. కృష్ణారెడ్డి

‘అందరూ బాగుండాలి.. అందులో ఆలీ కూడా ఉండాలి’ – ఎస్‌.వి. కృష్ణారెడ్డి

మలయాళం మూవీ ‘వికృతి’ సినిమాను తెలుగు నేటివిటీకి అనుగుణంగా రీమేక్‌ చేసి తెరకెక్కించిన యూత్‌ ఫుల్‌ మెసేజ్‌ ఓరియెంటెడ్‌ మూవీ ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’. అలీ సమర్పణలో అలీవుడ్‌ ఎంటర్టైన్మెంట్స్‌ బ్యానర్‌ పై అలీ, నరేష్‌ ప్రధాన పాత్రల్లో శ్రీపురం కిరణ్‌ దర్శకత్వంలో అలీబాబ, కొణతాల మోహన్‌కుమార్‌, శ్రీ చరణ్‌ ఆర్‌. లు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్‌ 28న ఆహాలో స్ట్రీమింగ్‌ అవుతుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో చిత్ర ట్రైలర్‌, టీజర్‌ను ఘనంగా లాంచ్‌ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన దర్శక, నిర్మాతలు ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, స్టార్‌ కామెడియన్‌ బ్రాహ్మానందం చేతుల మీదుగా ఈ చిత్రం ట్రైలర్‌, టీజర్‌ ను లాంచ్‌ చేశారు. వీరితో పాటు చిత్ర యూనిట్‌ సభ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దర్శక, నిర్మాత ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ..’ ఈ చిత్రం టైటిల్‌ వినడానికి చాలా ఆనందంగా ఉంది. ఎక్కడో మలయాళంలో చూసిన “వికృతి” సినిమా నచ్చి తెలుగు ప్రేక్షకులకు అందించాలనే తపనతో తనే నిర్మాతగా మారి సీనియర్‌ నటులందరినీ తీసుకొని తీసిన ఈ సినిమాకు కొత్త దర్శకుడిని, మ్యూజిక్‌ డైరెక్టర్‌ను పరిచయం చేయడం గొప్ప విషయం. మేము ఆలీతో తీసిన బ్లాక్ బస్టర్ ‘యమలీల’ నెక్ట్స్‌ ఇయర్‌కు 30 సంవత్సరాలు అవుతుంది. నటుడుగా వేయి చిత్రాలకు పైగా నటించిన ఆలీ ఈ చిత్రం ద్వారా సొంత బ్యానర్‌ పెట్టి సినిమా నిర్మించే స్థాయికి ఎదిగడం చాలా సంతోషంగా ఉంది. అందరూ బాగుండాలి.. అందులో ఆలీ కూడా ఉండాలి అన్నారు.

Also Read: ఎస్వీ కృష్ణారెడ్డి చేతుల మీదుగా గణా ఫస్ట్ లుక్ పోస్టర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్