Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్ఏపీఎల్ లోగో ఆవిష్కరించిన సిఎం జగన్

ఏపీఎల్ లోగో ఆవిష్కరించిన సిఎం జగన్

APL: ఐపీఎల్‌ తరహాలో  ఏపీఎల్‌ మ్యాచ్‌లను  నిర్వహించాలని ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్ నిర్ణయించింది. ఈ మేరకు బీసీసీఐ అనుమతులు కూడా సంపాదించింది. ఇప్పటికే తమిళనాడు, కర్నాటక,  సౌరాష్ట్ర  క్రికెట్ బోర్డులు ఈ తరహా అనుమతులు పొందాయి. నాలుగో రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్ నిలిచింది.

 Apl Logo

ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌ టీ– 20 తొలి టోర్నమెంట్ జులై 6 నుంచి జులై 17 వరకు విశాఖపట్నం డాక్టర్‌ వైయస్‌ఆర్‌ ఏసీఏ వీడీసీఏ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో  జరగనుంది. ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ బృందం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి  జులై 17న జరిగే ఫైనల్‌కు రావాల్సిందిగా ఆహ్వానించింది.  ఏపీఎల్- 20లోగోను సిఎం ఆవిష్కరించారు.  లోగోతో పాటు ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌ టీ – 20 టీజర్‌ను కూడా సిఎం విడుదల చేశారు.

సిఎం ను కలిసిన వారిలో ఏసీఏ ప్రెసిడెంట్‌ పి.శరత్‌ చంద్రారెడ్డి, ట్రెజరర్‌ ఎస్‌.ఆర్‌.గోపినాద్‌ రెడ్డి, సీఈవో ఎం.వి.శివారెడ్డి, గవర్నింగ్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ టి.సత్యప్రసాద్, సభ్యులు ప్రసాద్, గోపాల రాజు, టెక్నికల్‌ ఇంచార్జి విష్ణుదంతు ఉన్నారు. ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి కూడా వీరితో కలిసి సిఎం ను కలుసుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్