"శునకము బతుకును సుఖమయ్యే తోచుగాని,
తనకది హీనమని తలచుకోదు"- శునకానికి తన జన్మ గొప్పదిగానే తోస్తుంది- తనది మరీ కుక్క బతుకు అయిపోయిందని అది అనుకోదు అని అన్నమయ్య కీర్తన. అలా మనం కూడా...
తాగు అన్నది ఆదేశాత్మక క్రియాపదం. బోతు కలిపితే తాగుబోతు మనుష్య వాచకం. తాగుడు/తాగడం అన్నది భావార్థకం. తాగించు అన్నది మరొకరి ప్రమేయంతో జరిగే క్రియ. కలిసి తాగడం, ఒంటరిగా తాగడం, గుండెలు పగిలే...
పెళ్ళిలో పురోహితుడి పాత్ర గొప్పదా? ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్ల పాత్ర గొప్పదా? అన్న ప్రశ్నే ఇప్పుడు అర్థరహితమైనది. చిన్నప్పుడు స్కూళ్లల్లో కత్తి గొప్పదా- కలం గొప్పదా? అన్న విషయంమీద వ్యాసాలు రాయించేవారు. వక్తృత్వపు పోటీలు...
చాలామంది విజయం సాధించిన మహిళలను లేదా కేవలం వారి విజయాలకు సంబంధించిన అంశాలు మాత్రమే అడుగుతూ ఉంటారు.
ఈ జీవితంలో మనకి ఎదురయ్యే ఏ అనుభవమైనా ... తప్పులు, విజయాలు, సంతోషాలు, బాధలు ......
ఇంగ్లీషులో మేనేజ్ అనే క్రియా పదానికి చాలా లోతయిన అర్థం ఉంది. దేన్నయినా మేనేజ్ చేయడం అన్నప్పుడు నెగటివ్ మీనింగ్ కూడా ఉంది. ఆ మేనేజ్ క్రియావిశేషణమయినప్పుడు మేనేజ్మెంట్ అన్న భావార్థక పదం...
డిజిటల్ వ్యామోహంలో మనుషులు వింత వింతగా ప్రవర్తిస్తున్నారు. వైవిధ్యం కోసం ఉచితానుచితాలు మరచిపోతున్నారు. ఎక్కడ ఏమి చేయకూడదో అవే చేస్తున్నారు. ఎక్కడ ఏమి మాట్లాడకూడదో అవే మాట్లాడుతున్నారు.
పదేళ్లలో డిజిటల్ మీడియా ఆకాశం అంచులు...
ఈమధ్య భారత సర్వోన్నత న్యాయస్థానానికి తరచుగా ఒక విషయంలో తల బొప్పి కడుతున్నట్లుంది. న్యాయస్థానమంటే ఇటుకలు, రాళ్ళు, గోడలు, పైకప్పు కాదు కదా! న్యాయం మూర్తీభవించిన లేదా మూర్తీభవించాల్సిన చోటు. న్యాయం దానికదిగా...
ఏమిటా పిచ్చి మాటలు ? అని విసుక్కుంటాం కానీ నిజానికి ఎవరి పిచ్చి వారికి అక్షరాలా ఆనందం; కొందరికి ఆ పిచ్చే పరమానందం; కొద్దిమందికి ఆ పిచ్చే బ్రహ్మానందం. మానసికశాస్త్రవేత్తలు నయం చేయగలమనుకునేది...
కావ్య భాష;
గ్రాంథిక భాష;
ప్రామాణిక భాష;
మాండలిక భాష;
యంత్రానువాద భాష;
తెలుగు- ఇంగ్లిష్ కలగలిపిన తెంగ్లిష్ భాష;
చివర క్రియాపదం మాత్రమే తెలుగయి...ముందు భాగమంతా ఇంగ్లిష్ అయిన నవనాగరికుల ఆధునిక భాష;
రైల్వే స్టేషన్ అనౌన్స్ మెంటు లా ప్రతిపదాన్ని,...