Sunday, January 19, 2025
Homeసినిమాలైగ‌ర్ సెన్సార్ టాక్ ఏంటి?

లైగ‌ర్ సెన్సార్ టాక్ ఏంటి?

సెన్సేష‌న‌ల్ హీరో విజయ్‌ దేవరకొండ, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్లో రూపొందిన భారీ పాన్ ఇండియా మూవీ లైగ‌ర్. ఇందులో విజ‌య్ స‌ర‌స‌న అన‌న్య పాండే న‌టించింది. డిఫ‌రెంట్ గా ప్ర‌మోష‌న్స్ చేస్తూ.. రోజురోజుకు లైగ‌ర్ మూవీ పై అంచ‌నాలు పెంచేస్తున్నారు. ఆగ‌ష్టు 25న లైగ‌ర్ మూవీని వ‌ర‌ల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ చేయ‌నున్నారు.  ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది.

ఈ సినిమాలో కొన్ని అసభ్యకరమైన సీన్స్‌ ఉన్నాయని, వాటిని మార్చాలని బోర్డు సభ్యులు ఆదేశించారు. ముఖ్యంగా విజయ్‌ దేవరకొండ చెప్పే బోల్డ్‌ డైగాల్స్‌కి సెన్సార్‌ సభ్యులు అభ్యంతరం వ్యక్తంతో చేతులతో సంజ్ఞ చేసే సీన్‌ని పూర్తిగా తొలగించమని చెప్పింది. మొత్తంగా ఏడు సన్నివేశాలను మార్పులు చేయాల్సిందిగా బోర్డ్‌ ఆదేశాలు జారీ చేసింది. సెన్సార్ బోర్డు ఆదేశాల మేరకు ఆయా సీన్స్‌ను తొలగించారు లైగర్ మేక‌ర్స్.

విజయ్‌ దేవరకొండ సినిమాల్లో సాధారణంగా బోల్డ్‌ సీన్స్‌, డైలాగ్స్ ఉంటాయి. ఇక పూరి తోడైతే ఎలాంటి బోల్డ్‌ సీన్స్‌ ఉంటాయో ఊహించొచ్చు. మరి ఆ ఏడు సీన్ల తొలగింపు ప్రభావం సినిమాపై ఎలా ఉంటుందో చూడాలి. సినిమాకి పాజిటివ్ టాక్ ఉంది. విజ‌య్ చెప్పిన‌ట్టుగా లైగ‌ర్ మూవీతో ఇండియా షేక్ అయ్యేట్టు చేస్తాడేమో చూడాలి.

Also Read : బీహార్ లోనూ లైగర్ కు సూపర్ రెస్పాన్స్   

RELATED ARTICLES

Most Popular

న్యూస్