Saturday, January 18, 2025
Homeసినిమాచరణ్‌ మూవీలో ఒక్క పాటకు అంత బడ్జెట్టా..?

చరణ్‌ మూవీలో ఒక్క పాటకు అంత బడ్జెట్టా..?

రామ్ చరణ్‌, శంకర్ కాంబినేషన్లో భారీ పాన్ ఇండియా మూవీ రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రం చరణ్‌ కు 15వ చిత్రం కాగా, దిల్ రాజుకు 50వ చిత్రం కావడం విశేషం. అందుకనే ఈ భారీ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కైరా అద్వానీ నటిస్తుంటే… శ్రీకాంత్, సునీల్, అంజలి, ఎస్.జే. సూర్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. శంకర్ తెలుగులో చేస్తున్న ఫస్ట్ మూవీ కావడంతో అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి.

ప్రస్తుతం ఈ సినిమా కోసం న్యూజిలాండ్ లో చరణ్, కైరా అద్వానీ పై ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇండియాలో పాట‌ల మీద ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్టి, భారీగా ఖ‌ర్చు పెట్టించే ద‌ర్శ‌కుడు ఎవ‌రంటే మ‌రో మాట‌ల లేకుండా శంక‌ర్ పేరు చెప్పేయొచ్చు. ఆయ‌న సినిమాల్లో పాట‌ల మీద పెట్టే బ‌డ్జెట్‌తో రెండు మూడు చిన్న సినిమాలు తీసేయొచ్చంటే అతిశ‌యోక్తి కాదు. ‘జీన్స్’, ‘అప‌రిచితుడు’, ‘శివాజీ’, ‘రోబో’ లాంటి సినిమాట్లో పాట‌ల‌ను ఎంత భారీగా తీశారో తెలిసిందే. మ‌ధ్య‌లో కొన్ని సినిమాల్లో ఆయ‌న‌కు పాట‌ల మీద కొంచెం శ్ర‌ద్ధ త‌గ్గిన‌ట్లు అనిపించింది.

అసలు విషయానికి వస్తే.. చ‌ర‌ణ్‌తో తీస్తున్న సినిమాలో మ‌ళ్లీ సాంగ్స్‌లో శంక‌ర్ మార్కు చూడొచ్చ‌ని అంటున్నారు. ఈ చిత్రంలో పాట‌ల కోసం ప‌దుల కోట్లు ఖ‌ర్చ‌వుతున్న‌ట్ల స‌మాచారం. ఇందులో ఒక్క పాట‌కే 15 కోట్లు వెచ్చిస్తున్నార‌ట‌. ఇప్పుడు ఈ విష‌య‌మే టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతోంది. ఈ నెల 20 నుంచి రెండు వారాల పాట‌లు న్యూజిలాండ్‌లో ఈ పాట చిత్రీక‌రించ‌బోతున్నారు. ఒక ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్‌తో క‌లిసి శంక‌ర్ ఈ పాట‌ను గ్రాండ్‌గా డిజైన్ చేశాడ‌ట‌. ఒక్క పాట మీద 15 కోట్లంటే అది ఎంత భారీగా ఉంటుందో అంచ‌నా వేయొచ్చు. మ‌రి.. తెర‌ పై ఆ పాట ఎంత అద్భుతంగా ఉంటుందో చూడాలి.

Also Read : రామ్‌చరణ్‌, శంకర్‌ మూవీకి తమన్ సంగీతం

RELATED ARTICLES

Most Popular

న్యూస్