Monday, January 20, 2025
HomeTrending Newsఫిబ్రవరి 17న సచివాలయం ప్రారంభం

ఫిబ్రవరి 17న సచివాలయం ప్రారంభం

తెలంగాణ ప్రభుత్వ నూతన సచివాలయ భవన సముదాయాన్ని ఫిబ్రవరి 17 ప్రారంభించనున్నారు.  ముఖ్యమంత్రి కేసిఆర్ పుట్టినరోజు అయిన ఫిబ్రవరి 17న ముహూర్తం ఖరారు చేశామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, శాసన సభా వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు.

26.29 ఎకరాల్లో, 11.45 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో…. నిజాం సర్కార్ కట్టడాలను పోలుస్తూ  ఈ సచివాలయాన్ని నిర్మించారు. ఇప్పటికే పనులు పూర్తయ్యాయని, తుదిమెరుగులు దిద్దుతున్నారని సమాచారం. తొలుత సంక్రాంతికే ప్రారంచించాలని అనుకున్నారు, అయితే పనులు పూర్తి కాకపోవడంతో ఫెబ్రవరి 26న మంచి ముహూర్తం ఉందని, ఆ రోజున అయితే బాగుంటుందని భావించారు.

ఫిబ్రవరి 17న కేసిఆర్ జన్మదిన కావడంతో అదే రోజున సచివాలయాన్ని ప్రారంభించి, సిఎం  తన ఛాంబర్ లో కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 610 కోట్ల రూపాయల వ్యయంతో ఈ భవన సముదాయాన్ని నిర్మించారు. 2019 జూన్ 27 న సచివాలయానికి భూమి పూజ చేశారు. దాదాపు మూడు సంవత్సరాల 8 నెలలపాటు దీని నిర్మాణం సాగింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్