Sunday, January 19, 2025
Homeసినిమాశ్రుతి హాసన్ కి డిమాండ్ పెరిగినట్టే!

శ్రుతి హాసన్ కి డిమాండ్ పెరిగినట్టే!

తెలుగు తెరకి పరిచయమైన నాజూకు సౌందర్యం శ్రుతి హాసన్. టాలీవుడ్ నుంచి ఆమెకి చెప్పుకోదగిన హిట్లు ఉన్నాయి. ఒకానొక సమయంలో ఆమె కోలీవుడ్ కంటే టాలీవుడ్ కే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చింది. అలాగే ఆ తరువాత టాలీవుడ్ కంటే బాలీవుడ్ కి ఇంపార్టెన్స్ ఇచ్చింది. అక్కడ కుదురుకోవడం కోసం టాలీవుడ్ ను .. కోలీవుడ్ ను కూడా పక్కన పెట్టేయడం ఆమె చేసిన పొరపాటు అయింది. బాలీవుడ్ లో ఆమె అనుకున్న స్థాయిలో .. ఆశించిన స్థాయిలో కుదురుకోలేకపోయింది. దాంతో ఆమె ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో పడిపోయింది.

అలాంటి సమయంలో ఆమెను ఆదుకున్నది తెలుగు సినిమానే. తెలుగులో వచ్చిన ‘క్రాక్’ సినిమా ఆమె తేలికగా ఊపిరి పీల్చుకునేలా చేసింది. ఆ హిట్ ఇచ్చిన కారణంగానే గోపీచంద్ మలినేని అడగ్గానే ఆమె ‘వీరసింహా రెడ్డి’ చేయడానికి అంగీకరించింది. ఇక ఇదే సమయంలో ఆమె చిరంజీవి సరసన ‘వాల్తేరు వీరయ్య’లో అవకాశాన్ని అందుకుంది. ఈ రెండు సినిమాలపై శ్రుతి ఆశలు పెట్టుకుంది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ రెండు సినిమాలు కూడా చాలా ఫాస్టుగా 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయాయి.

ఒకేసారి రెండు భారీ హిట్లు లభించడం శ్రుతి చేసుకున్న అదృష్టమే. ఇది ఆమె డిమాండును .. పారితోషికాన్ని పెంచే అంశమే. శ్రియ .. కాజల్ .. తమన్నా వంటి సీనియర్ హీరోయిన్స్ ఇప్పుడు రేసులో లేకపోవడం శ్రుతికి కలిసొచ్చే అంశంగా మారింది. వెంకటేశ్ .. పవన్ కల్యాణ్ లాంటివారికి కూడా ఆమెనే ఫస్టు ఆప్షన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక లైన్లో పాన్ ఇండియా ప్రాజెక్టుగా ‘సలార్’ ఉండనే ఉంది. దీనిని బట్టి చూస్తుంటే శ్రుతి మరింత జోరుగా సాగే అవకాశాలు పుష్కలంగా  కనిపిస్తున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్