Sunday, January 19, 2025
HomeTrending Newsజీనోమ్ వ్యాలీకి భారీగా పెట్టుబడులు

జీనోమ్ వ్యాలీకి భారీగా పెట్టుబడులు

హైదరాబాద్ జీనోమ్ వ్యాలీకి భారీగా పెట్టుబడులు తరలివచ్చాయి. యపాన్ బయో ప్రాసెస్ డెవలప్మెంట్ ఫెసిలిటీ, GVPR ఫ్రీ క్లినికల్ రీసెర్చ్ ఫెసిలిటీ, విమ్టా ల్యాబ్స్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ప్రోడక్ట్ టెస్టింగ్ సెంటర్, బయో ఫార్మా హబ్ (బి-హబ్) ,Rx Propellant నిర్మాణం చేస్తున్న ల్యాబ్ ఫెసిటిల నిర్మాణం వంటి సుమారు 1100 కోట్ల రూపాయల పెట్టుబడులతో తమ తమ విస్తరణ ప్రణాళికలు ప్రకటించాయి. ఆయా కంపెనీ కార్యాలయాల ప్రారంభోత్సావాలు, శంఖుస్థాపన కార్యక్రమాల్లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. తాజా పెట్టుబడులతో సుమారు 3000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

తొమ్మిది లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో లైఫ్ సైన్సెస్ మౌలిక వసతుల అభివృద్ధిని ప్రారంభించిన కేటీఆర్

లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ రంగాలకు ఉపయుక్తంగా ఉండేలా Rx Propellant సంస్థ ఏర్పాటు చేస్తున్న రీసెర్చ్ ల్యాబ్ మౌలిక వసతుల సదుపాయాల విస్తరణను ఈరోజు మంత్రి కే.తారక రామారావు ప్రారంభించారు. సుమారు 900 కోట్ల రూపాయల పెట్టుబడితో తొమ్మిది లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ రీసెర్చ్ ల్యాబ్ ఉంటుంది. రానున్న రెండు సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో అదనంగా సుమారు 2000 కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టనున్నట్లు సంస్థ తెలిపింది. ఈ విస్తరణతో మరో మూడు వేలకుపైగా ఉద్యోగాలు ఏర్పడతాయి. Rx Propellant ఏర్పాటుచేస్తున్న ఈ ఫెసిలిటీతో లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ రంగంలో భారీగా పెట్టుబడులు వస్తాయన్న ఆశాభావాన్ని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వ్యక్తం చేశారు. దీంతో అత్యధిక ల్యాబ్ విస్తీర్ణం కలిగిన బయోటెక్నాలజీ క్లస్టర్ గా హైదరాబాదు జీనోమ్ వ్యాలీ నిలుస్తుందన్నారు. Rx Propellant కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ విశాల్ గోయల్ మాట్లాడుతూ భారతదేశంలో లైఫ్ సైన్సెస్ రంగానికి అద్భుతమైన భవిష్యత్తు ఉందని, ముఖ్యంగా నైపుణ్యం కలిగిన మానవ వనరులు, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు ఉన్న హైదరాబాద్ నగరం ఇందులో ముందు వరుసలో ఉండే అవకాశం ఉందన్నారు. బయోటెక్నాలజీ రంగంలోకి భారీగా పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించేందుకు ఈ నూతన మౌలిక వసతుల కల్పన కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు.
బయో ఫార్మా హబ్ (బి-హబ్ ) కు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీఎస్ఐఐసి, కేంద్ర ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ లు ఉమ్మడిగా ఏర్పాటుచేస్తున్న బయో ఫార్మా హబ్ (బి-హబ్ ) కు జీనోమ్ వ్యాలీలో మంత్రి కేటీఆర్ శంఖుస్థాపన చేశారు. బయో ఫార్మా రంగానికి భారతదేశంలోనే అత్యంత కీలకంగా మారిన జీనోమ్ వ్యాలీలో మరిన్ని పరిశోధనలకు ఊతంగా నిలిచేలా ఈ బయోహబ్ ని ఏర్పాటుచేస్తున్నారు. హైదరాబాద్ కేంద్రంగా పరిశోధన అభివృద్ధి , వివిధ ప్రపంచ స్థాయి కంపెనీల భాగస్వామ్యం…అందుకు అవసరమైన శిక్షణ పరిశోధనా వంటి వివిధ రకాల కార్యక్రమాలకు ఈ బి-హబ్ కేంద్రంగా ఉండబోతుందన్నారు.
2030 నాటికి హైదరాబాద్ కేంద్రంగా 100 బిలియన్ డాలర్ల విలువ కల బయో టెక్నాలజీ రంగాన్ని నిర్మించాలన్న సమున్నత లక్ష్యంతో పనిచేస్తున్నామన్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఆ లక్ష్య సాధనలో  బి- హబ్ కీలకంగా మారబోతుందన్నారు. హైదరాబాద్ లోని బయో టెక్నాలజీ కంపెనీలు, బయోటెక్నాలజీ ఈకోసిస్టమ్ బి-హబ్ తో ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. ఈ బి-హబ్ ఏర్పాటుతో ఆ రంగంలో తన అగ్రశ్రేణి స్థానాన్ని తెలంగాణ మరింత పదిలపరుచుకుంటుందన్న విశ్వాసాన్ని కేటీఆర్ వ్యక్తం చేశారు.

ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్ టెస్టింగ్ ల్యాబ్ ను ప్రారంభించిన విమ్టా ల్యాబ్స్

భారతదేశానికి చెందిన ప్రఖ్యాత లైఫ్ సైన్సెస్ కంపెనీ విమ్టా ల్యాబ్స్ ప్రపంచ స్థాయి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ల్యాబ్ ని హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో ఏర్పాటు చేసింది. తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు, విమ్టా ల్యాబ్స్ చైర్మన్ ఎస్పీ వాసిరెడ్డి, కంపెనీ సీనియర్ ప్రతినిధి బృందం ఈ ల్యాబ్ ని ప్రారంభించారు. యాక్టివ్ మెడికల్ డివైసెస్, వైర్లెస్ డిఫెన్స్, ఇతర ఎలక్ట్రానిక్ ఇండస్ట్రియల్ సెక్టార్లకు ఈ ల్యాబ్ తో సేవలు అందిస్తామని కంపెనీ తెలిపింది. ఈ నూతన ల్యాబ్ తో లైఫ్ సైన్సెస్ రంగంలో ముఖ్యంగా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ సంబంధిత ఉత్పత్తులకు ఎంతగానో సహకారం దొరుకుతుందని కేటీఆర్ అన్నారు.

ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ సంబంధిత పరికరాల తయారీ, అభివృద్ధి అనేవి భారతదేశ లైఫ్ సైన్సెస్ రంగానికి ఎంతో కీలకమని విమ్టా ల్యాబ్ చైర్మెన్ ఎస్పీ వాసిరెడ్డి అన్నారు. తమ కంపెనీ ఏర్పాటు చేస్తున్న నూతన ల్యాబ్ తో దేశ బయో మెడికల్ లైఫ్ సైన్సెస్ రంగానికి ఈ విషయంలో అత్యుత్తమ సేవలను అందించే వీలుకలుగుతుందన్నారు. ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఏర్పాటుచేసిన ఈ ల్యాబ్ భారతదేశ మేకిన్ ఇండియా లక్ష్యానికి అనుగుణంగా ఉందని తెలిపారు. ఇప్పటికే తాము EMTAC ( ఏంటాక్) లాబొరేటరీని టేకోవర్ చేశామని, ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న ఈ ల్యాబ్ పైన 70 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టనున్నట్లు వాసిరెడ్డి చెప్పారు.

GVPR సంస్థకు చెందిన ఫ్రీ క్లినికల్ రీసెర్చ్ ఫెసిలిటీని ప్రారంభించిన కేటీఆర్

జివిపిఆర్ సంస్థకు చెందిన ప్రీ క్లినికల్ రీసెర్చ్ ఫెసిలిటీ సెంటర్ ని హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో మంత్రి కే.తారకరామారావు ఈరోజు ప్రారంభించారు. సుమారు 28 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటుచేసిన కమర్షియల్ బ్రీడింగ్-టెస్టింగ్ ఫెసిలిటీతో ప్రీ క్లినికల్ కాంట్రాక్టు రీసెర్చ్ రంగంలో సేవలను అందించనున్నట్లు కంపెనీ తెలిపింది. సుమారు 40 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ కేంద్రాన్ని ఏర్పాటుచేశామని తెలిపింది. రానున్న మూడు సంవత్సరాల్లో మరో 10 మిలియన్ డాలర్ల పెట్టుబడిని జీనోమ్ వ్యాలీలో పెడతామని తెలిపింది. వెటర్నరీ, టాక్సికాలాజీ, ఫార్మాకాలజీ, అనలిటికల్ రీసెర్చ్ వంటి రంగాలకు చెందిన 100 మందికి పైగా వ్యక్తులకు ఉద్యోగాలు కల్పిస్తామంది. లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ రంగంలో అత్యంత కీలకమైన హైబ్రిడ్ జంతువుల ఉత్పత్తి, పరిశోధన, టెస్టింగ్ వంటి అంశాలకు తమ ల్యాబ్ ఉపయోగపడుతుందని జీవీపీఆర్ తెలిపింది. ప్రపంచంలోని ప్రఖ్యాత బయో మెడికల్ కంపెనీలతో కలిసి పని చేస్తున్నామంది. జీనోమ్ వ్యాలీలో ఇప్పటికే నేషనల్ అనిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఉందని, ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న ఈ నూతన కేంద్రంతో ప్రీ క్లినికల్, క్లినికల్ టెస్టింగ్ వేగంగా కొనసాగేందుకు అవకాశం ఉంటుందని మంత్రి కెటియార్ కంపెనీ టెస్టింగ్ సెంటర్ ఒపెనింగ్ తర్వతా చెప్పింది.

Also Read :

హైదరాబాద్‌లో రోచె ఫార్మా రెండో డేటా సెంటర్‌

RELATED ARTICLES

Most Popular

న్యూస్