కామన్ వెల్త్ గేమ్స్ లో భాగంగా బ్యాడ్మింటన్ లో నేడు జరిగిన రెండో గ్రూప్ మ్యాచ్ లో శ్రీలంకపై 5-0 తేడాతో ఇండియా విజయం సాధించి క్వార్టర్స్ బెర్త్ ను దాదాపు ఖాయం చేసుకుంది. నిన్న జరిగిన మొదటి గ్రూప్ మ్యాచ్ లో పాకిస్తాన్ పై 5-0తో సంపూర్ణ విజయం సాధించిన ఇండియా నేడు కూడా అదే జోరు కొనసాగించింది.
మొదట జరిగిన మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్ లో అశ్విని పొన్నప్ప- సాత్విక్ సాయిరాజ్ జోడీ 21-14;21-9తో సచిన్-తిల్ని జోడీ పై
రెండో మ్యాచ్… పురుషుల సింగిల్స్ లో లక్ష్య సేన్ 21-18;21-5తో ఎన్. కరుణరత్నే పై
మూడో మ్యాచ్…. మహిళల సింగిల్స్ లో ఆకర్షి కాశ్యప్ 21-3;21-9తేడాతో విదార సుహాస్నిపై
నాలుగో మ్యాచ్… పురుషుల డబుల్స్ లో చిరాగ్ శెట్టి-బి.సుమీత్ రెడ్డి జోడీ 21-10;21-13 తేడాతో దుమిండు-సచిన్ లపై
ఐదో మ్యాచ్…మహిళల డబుల్స్ లో గాయత్రి గోపీచంద్- త్ర్రెసా జాలీలు 21-18;21-6తో తిల్ని-విదార సుహాస్ని లపై గెలుపొందారు.