Tuesday, February 25, 2025
Homeస్పోర్ట్స్Under 19 World Cup (W): ఫైనల్లో భరత్

Under 19 World Cup (W): ఫైనల్లో భరత్

సౌతాఫ్రికాలో జరుగుతోన్న అండర్ 19 వరల్డ్ మహిళల టి 20 వరల్డ్ కప్ టోర్నమెంట్ లో ఇండియా జట్టు ఫైనల్ కు చేరుకుంది. నేడు జరిగిన సెమీ ఫైనల్లో న్యూ జిలాండ్ పై 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇండియా… సౌతాఫ్రికాను 109పరుగులకు కట్టడి చేసింది.  పర్షవి చోప్రా మూడు వికెట్లతో రాణించింది.

 కెప్టెన్ షఫాలీ వర్మ (10) త్వరగా ఔటైనా మరో ఓపెనర్ శ్వేత షెరావత్ 45 బంతుల్లో 10 ఫోర్లతో 61  పరుగులు చేసి అజేయంగా నిలిచింది. సౌమ్య తివారీ 22 రన్స్ చేయగా  గొంగడి త్రిష 5 పరుగులతో నాటౌట్ గా నిలిచింది.

పర్షవి చోప్రాకు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’  దక్కింది.

ఆదివారం జరిగే ఫైనల్లో ఇంగ్లాండ్ తో ఇండియా తలపడనుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్