Friday, November 22, 2024
Homeస్పోర్ట్స్India (W)-England(W): ఇండియాదే వన్డే సిరీస్

India (W)-England(W): ఇండియాదే వన్డే సిరీస్

భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 111 బంతుల్లో 18 ఫోర్లు, 4 సిక్సర్లతో 143 పరుగులు చేసి అజేయంగా నిలవడంతో ఇండియా- ఇంగ్లాండ్ మహిళా క్రికెట్ జట్ల మధ్య జరిగిన రెండో వన్డేలో ఇండియా 88 పరుగులతో ఘనవిజయం సాధించి మ్యాచ్ తో పాటు సిరీస్ కూడా గెల్చుకుంది. హర్లీన్ డియోల్-58; స్మృతి మందానా-40 పరుగులతో రాణించారు. ఇండియా విసిరిన 334 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో తడబడిన ఆతిథ్య ఇంగ్లాండ్ మహిళలు 245 పరుగులకే ఆలౌట్ అయ్యారు.

కాంటర్ బారీ లోని సెయింట్ లారెన్స్ గ్రౌండ్ లో జరిగిన ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇండియా 12 పరుగులకే తొలి వికెట్ (షఫాలీ వర్మ-8) కోల్పోయింది. యస్తికా భాటియా 26, స్మృతి మందానా 40 పరుగులు చేసి ఔటయ్యారు. కెప్టెన్ హర్మన్- హర్లీన్ డియోల్ లు నాలుగో వికెట్ కు 113 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. డియోల్ 58; పూజా వస్త్రాకర్-18 పరుగులు చేసి ఔట్ కాగా,  హర్మన్-143; దీప్తి శర్మ-15 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. ఇండియా 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 333 పరుగులు చేసింది.

భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 47 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. జట్టులో డానియేల్లె వ్యాట్-65; ఆలీస్ క్యాప్సీ-39; కెప్టెన్ అమీ జోన్స్-39; చర్లోయేట్ డీన్-37 మాత్రమే రాణించారు. భారత బౌలర్లు రాణించడంతోపాటు ఫీల్డర్లు కూడా చురుగ్గా కదిలి సత్తా చాటడంతో 44.2 ఓవర్లలో 245 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

భారత బౌలర్లలో రేణుక సింగ్ నాలుగు వికెట్లు సాధించింది. దయాలన్ హేమలత రెండు; దీప్తి శర్మ, షఫాలీ వర్మ చెరో వికెట్ సాధించారు.

సెంచరీ తో అదరగొట్టిన హర్మన్ ప్రీత్ కౌర్ కే ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ లభించింది.

మూడు వన్డేల సిరీస్ లో భాగంగా తొలి రెండు మ్యాచ్ లు గెలిచిన ఇండియా  సిరీస్ కైవసం చేసుకుంది, ఆఖరి వన్డే లార్డ్స్ స్టేడియంలో శనివారం జరగనుంది.

Also Read : Asia Cup Cricket (Women): 15 మందితో ఇండియా జట్టు 

RELATED ARTICLES

Most Popular

న్యూస్