ఈ ప్రభుత్వ నిర్వాకం వల్ల స్థానిక ఎన్నికల్లో బిసిలు 10శాతం రిజర్వేషన్స్ కోల్పోవాల్సి వచ్చిందని టిడిపి నేత, ఎమ్మెల్సీ నారా లోకేష్ అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో బిసిలకు సంక్షేమ భవనాలు కట్టించడం మొదలు పెట్టామని, కనీసం వాతిని పూర్తి చేయలేకపోతున్నారని విమర్శించారు. పలమనేరు నియోజకవర్గంలోని బంగారు పాల్యెం లో బిసిలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ మూడున్నరేళ్లుగా బిసిలపై ఎన్నో కేసులు నమోదు చేశారన్నారు. బిసిల ఆర్ధిక అభ్యున్నతి కోసం ఈ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. విజయవాడలో బిసిల సభ్య పెట్టి ఏమి సాధించారని ప్రశ్నించారు.
సలహాదారులుగా బిసిలు పనికిరారా? అంటూ లోకేష్ ప్రశ్నించారు. కార్పొరేషన్ ఛైర్మన్ లు గా బిసిలకు అవకాశం ఇచ్చామని చెప్పుకుంటున్నారని, కానీ వారికి ఆఫీసు, కనీసం కుర్చీ కూడా లేదని మండిపడ్డారు. ప్రాధాన్యత ఉన్న సలహాదారుల పదవులన్నీ తమ సామాజిక వర్గం వారికే ఇచ్చారని, వారు ఒక్కొక్కరికీ మూడు లక్షల రూపాయల జీతం, ఇతర భత్యాలు ఇస్తున్నారని, కానీ కార్పొరేషన్ చైర్మన్లకు మాత్రం 75వేల జీతం మాత్రమే ఇస్తున్నారని దుయ్యబట్టారు. మొదటినుంచీ బడుగు బలహీన వర్గాలు ప్రాధాన్యత ఇస్తున్న పార్టీ తెలుగుదేశం అని గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో ఆర్ధిక మంత్రిగా యాదవ వర్గానికి చెందిన యనమలకు అవకాశం ఇచ్చిన ఘనత తమకే దక్కుతుందన్నారు.
జగన్ నిర్వాకం వల్ల రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రావడం లేదని, ఉపాధి అవకాశాలు లేక గ్రామాల నుంచి యువత వలస వెళ్ళిపోతున్నారని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read : ఇది నిరంకుశత్వం: నారా లోకేష్