Sunday, January 19, 2025
HomeTrending Newsమేం వచ్చాక మళ్ళీ మారుస్తాం : లోకేష్

మేం వచ్చాక మళ్ళీ మారుస్తాం : లోకేష్

తాము అధికారంలోకి వచ్చాక హెల్త్ యూనివర్సిటీకి మళ్ళీ ఎన్టీఆర్ పేరు పెడతామని టిడిపి ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ ప్రకటించారు.  ఎన్టీఆర్ పేరు మార్చడంపై అయన తీవ్రంగా మండిపడ్డారు. ఈ నిర్ణయంపై కేబినేట్ లో చర్చించారా, లేకపోతే పేపర్లపైనే జరిగినట్లు చూపించారా అని ప్రశ్నించారు. ఇంత రహస్యంగా ఎందుకు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. హెల్త్ యూనివర్సిటీ కి ఎన్టీఆర్ పేరు గత ప్రభుత్వంలో పెట్టింది కాదని, సమైఖ్య రాష్ట్రంలో 1998లోనే పెట్టారని గుర్తు చేశారు. హెల్త్ యూనివర్సిటీ కి ఏం చేశారని వైఎస్సార్ పేరు పెట్టారని లోకేష్ నిలదీశారు. ఎన్టీఆర్ నాడు ఓ ప్రైవేట్ యూనివర్సిటీని ఒప్పించి దాన్ని ప్రభుత్వ స్వాధీనం చేసుకొని ప్రత్యేకంగా నెలకొల్పారని చెప్పారు. ఈ తరహా పేర్లమార్పు రాజకీయాలు తమిళనాడులో ఉండేవని కానీ స్టాలిన్ సిఎం అయిన తరువాత అమ్మ క్యాంటిన్ల పేరు మార్చలేదని, కానీ ఇక్కడ అలాంటి రాజకీయం మొదలైందని ధ్వజమెత్తారు.

గత ప్రభుత్వంలో అనుకోని ఉంటే కడప జిల్లాకు, హార్టి కల్చర్ యూనివర్సిటీ కి వైఎస్ పేర్లు తీసివేసి ఉండేవాళ్లమని, కానీ తాము జగన్ లా ఆలోచించలేదన్నారు.  అవసరమైతే కొత్తగా ఏర్పాటు చేస్తున్న మెడికల్ కాలేజీల్లో ఏదో ఒక దానికి వైఎస్ పేరు పెట్టుకోవాలని అంతే కానీ ఎప్పటినుంచో హెల్త్ యూనివర్సిటీ కి కొనసాగుతున్న  ఎన్టీఆర్ పేరు మార్చడం దుర్మార్గమని మండిపడ్డారు.

ఈ అంశంపై తాము మండలిలో నిరసన తెలిపినా చైర్మన్ తమకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని, ఏకపక్షంగా వ్యవహరించి బిల్లును ఆమోదించుకున్నారని లోకేష్ ఆరోపించారు.  ఎంతో ముఖ్యమైన 9 బిల్లులు ఎలాంటి చర్చా లేకుండా కేవలం 9నిమిషాల్లో ఆమోదించుకున్నారని విమర్శించారు.

Also Read: లోకేష్ వ్యాఖ్యలు అభ్యంతరకరం: విజయసాయి

RELATED ARTICLES

Most Popular

న్యూస్