Sunday, January 19, 2025
Homeసినిమాఎన్టీఆర్‌, కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో NTR 30.. మోష‌న్ పోస్టర్ విడుదల

ఎన్టీఆర్‌, కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో NTR 30.. మోష‌న్ పోస్టర్ విడుదల

Mass Action: అటు మాస్, ఇటు క్లాస్ ప్రేక్షకుల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా…. మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాల‌ను క‌మ‌ర్షియ‌ల్ పంథాలో తెర‌కెక్కించే కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొంద‌నుంది. ఎన్టీఆర్ న‌టిస్తున్న 30వ చిత్ర‌మిది. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్‌ బ్యాన‌ర్స్ పై మిక్కిలినేని సుధాక‌ర్, హ‌రికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

శుక్ర‌వారం (మే 20)న ఎన్టీఆర్ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా ఈ సినిమా అనౌన్స్ చేస్తూ చిత్ర యూనిట్ మోష‌న్ పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఎన్టీఆర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆయ‌న త‌దుప‌రి సినిమాకు సంబంధించిన అనౌన్స్‌ మెంట్ కోసం ఆతృత‌గా ఎదురు చూస్తోన్న ఫ్యాన్స్‌, ప్రేక్ష‌కుల‌కు మంచి కిక్ ఇచ్చేలా ఈ మోస‌న్ పోస్ట‌ర్‌ను డిజైన్ చేశారు.

ఎన్టీఆర్‌కు బ‌ర్త్ డే విషెష్ చెప్ప‌డానికి NTR 30కి సంబంధింధించిన మోష‌న్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ మోష‌న్ పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే.. అందులో ఎన్టీఆర్ త‌న‌దైన స్టైల్లో ప‌క్కా మాస్ డైలాగ్‌ను చెబుతున్నారు. ఆ డైలాగ్‌కు అనిరుధ్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ నెక్ట్స్ లెవ‌ల్‌లో ఉండేలా మోష‌న్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు.

యంగ్ మ్యూజిక్ సెన్సేష‌న్ అనిరుధ్ సంగీత సార‌థ్యం వ‌హిస్తోన్న ఈ చిత్రానికి సాబు సిరిల్ ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ ర‌త్న‌వేలు విజువ‌ల్స్ అందిస్తున్న ఈ చిత్రానికి నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్ శ్రీక‌ర్ ప్ర‌సాద్ ఎడిట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

Also Read : ఎన్టీఆర్ బ‌ర్త్ డే.. మూడు స‌ర్ ఫ్రైజ్ లు…

RELATED ARTICLES

Most Popular

న్యూస్