Sunday, January 19, 2025
Homeసినిమాపవన్, లోకేష్ కనకరాజ్ కాంబో మూవీ నిజమేనా..?

పవన్, లోకేష్ కనకరాజ్ కాంబో మూవీ నిజమేనా..?

పవన్ కళ్యాణ్‌ వరుసగా నాలుగు సినిమాలు చేస్తున్నారు. వీరమల్లు, ‘బ్రో’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘ఓజీ’. ఈ సినిమాల్లో వీరమల్లు ఎప్పుడో స్టార్ట్ అయ్యింది కానీ.. ఎప్పటికి ఎండ్ అవుతుందో.. ఎప్పుడు థియేటర్లోకి వస్తుందో క్లారిటీ లేదు. బ్రో సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. జులై 28న బ్రో చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. చాలా ఫాస్ట్ గా ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. మరో వైపు సుజిత్ డైరెక్షన్ లో ఓజీ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాని డిసెంబర్ లోవిడుదల చేయాలి అనుకుంటున్నారు.

ఇలా వరుసగా నాలుగు సినిమాలతో బిజీగా ఉన్న పవన్ మరో సినిమాకి ఓకే చెప్పారని.. ఈ చిత్రానికి లోకేష్ కనకరాజ్ డైరెక్టర్ అని టాక్ వచ్చింది. అంతే కాకుండా ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మించేందుకు ప్లాన్ చేస్తుందని కూడా వినిపించింది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో పవన్ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇలాంటి టైమ్ లో లోకేష్ కనకరాజ్ తో మూవీ అనేది నిజమేనా..? లేక ఇది గ్యాసిప్పా అనేది ఆసక్తిగా మారింది. ప్రచారంలో ఉన్న ఈ వార్త గురించి ఆరా తీస్తే.. తెలిసింది ఏంటంటే.. ఇది నిజం కాదని.. గ్యాసిప్ అని తెలిసింది.

ఇప్పటికే పవన్ మొదట ఏ సినిమా కంప్లీట్ చేస్తారో అర్థం కాని పరిస్థితి ఉంది. ఉస్తాద్ భగత్ సింగ్ కంప్లీట్ చేయాలి. ఎప్పటి నుంచో వెయిటింగ్ లో ఉన్న వీరమల్లు చిత్రాన్ని పూర్తి చేయాలి. వీటికి టైమ్ ఇవ్వడానికే కుదరడం లేదు. ఇలాంటి టైమ్ లో మరో సినిమా చేయడం అంటే కుదరని పని. పవన్ ఎన్నికలు వచ్చే లోపు ఈ నాలుగు సినిమాలు పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యారట. అందుచేత కొత్త సినిమాలను ఇప్పట్లో ఒప్పుకునే పరిస్థితి లేదు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్