Friday, April 26, 2024
HomeTrending Newsమోదీ గో బ్యాక్‌.. సింగరేణిలో కార్మికుల నిరసనల హోరు

మోదీ గో బ్యాక్‌.. సింగరేణిలో కార్మికుల నిరసనల హోరు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనల హోరు కొనసాగుతున్నది. బొగ్గు గనుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సింగరేణి వ్యాప్తంగా కార్మికులు ఆందోళన బాటపట్టారు. మందమర్రి, బెల్లంపల్లి, భూపాలపల్లి, శ్రీరామ్‌పూర్‌, గోదావరిఖని, ఇల్లందు, కొత్తగూడెం, మణుగూరు ఏరియాల్లో కార్మికులు నిరసన వ్యక్తంచేశారు. నల్లబ్యాడ్జీలు ధరించడంతోపాటు నల్లజెండాలను ఎగురవేశారు. మోదీ గోబ్యాక్‌ నినాదాలతో హోరెత్తిస్తున్నారు.
కాగా, ప్రధాని పర్యటన నేపథ్యంలో పెద్దపల్లి జిల్లాలో ముందస్తు అరెస్టులు కొనసాగుతున్నాయి. సింగరేణిలోని 5వ ఇంక్లైన్‌ వద్ద సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావును, రామగిరిలో టీబీజీకేఎస్‌ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డిని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.
గోదావరిఖని 11వ గని వద్ద ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్యను ఇతర నాయకులను అరెస్టు చేశారు. తెలంగాణ రైతు సంఘం అధ్యక్షురాలు పస్య పద్మను హౌస్‌ అరెస్ట్‌ చేశారు. జీబీజీకేఎస్‌ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి అరెస్టుకు నిరసనగా కార్మికులు నిరసన వ్యక్తంచేశారు. కాగా, ప్రధాని పర్యటకు వ్యతిరేకంగా వామపక్షాలు నేడు రామగుండం బంద్‌నకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

Also Read : ప్రధాని పర్యటనకు నిరసనలు… సిపిఐ నేతల అరెస్ట్

RELATED ARTICLES

Most Popular

న్యూస్