Saturday, January 18, 2025
HomeTrending Newsస్వగ్రామానికి ప్రశాంత్ నీల్ భారీ విరాళం

స్వగ్రామానికి ప్రశాంత్ నీల్ భారీ విరాళం

సుప్రసిద్ధ దర్శకుడు ప్రశాంత్ నీల్ నేడు తన స్వగ్రామం నీలకంఠాపురంలో పర్యటించారు. మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత, పిసిసి మాజీ అధ్యక్షుడు డా. ఎన్.రఘువీరారెడ్డికి ప్రశాంత్ నీల్ స్వయానా అన్న కుమారుడు. నీలకంఠాపురంలో రఘువీరా నేతృత్వంలో నిర్మించిన దేవస్థానములను ప్రశాంత్ సందర్శించి స్వామి వార్ల  ఆశీర్వాదం తీసుకున్నారు.

అనంతరం తన చిన్నాన్న రఘువీరా నేతృత్వంలో గ్రామంలో జరుగుతోన్న అభివృద్ధి పనులను అడిగి తెలుసుకున్నారు. ఎల్వీ ప్రసాద్ ఇన్స్టిట్యూట్ వారు గ్రామంలో ఓ కంటి ఆస్పత్రి భారీ స్థాయిలో నిర్మించాలని తలపెట్టారు. దీనికి గాను ప్రశాంత్ నీల్ 50 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కంటి శిబిరంలో ప్రశాంత్ పరీక్షలు చేయించుకున్నారు.

తన సోదరుని కుమారుడైన ప్రశాంత్ భారీ మొత్తంలో విరాళం ఇవ్వడం పట్ల రఘువీరా తన సంతోషం వ్యక్తం చేశారు. ఇదే రోజు ప్రశాంత్ తండ్రి, తన సోదరుడు సుభాష్ 75వ జయంతి కూడా అని అయన వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్