ఇంగ్లాండ్ తో జరిగిన రెండోవన్డేలో ఇండియా 100 పరుగులతో ఘోర ఓటమి పాలైంది. రీస్ టాప్లే 9.5 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 24 పరుగులిచ్చి 6 వికెట్లు తీసి ఇండియా బ్యాటింగ్ ను కకావికలం చేశాడు. 247 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా 38.5 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇంగ్లాండ్ టాప్ఆర్డర్ బ్యాట్స్ మెన్ విఫలమయ్యారు. జట్టులో మోయిన్ అలీ (47); డేవిడ్ విల్లె (41); బెయిర్ స్టో(38); లివింగ్ స్టోన్ (33) కాస్త ఫర్వాలేదనిపించారు. యజువేంద్ర చాహల్ మరోసారి తన స్పిన్ మాయాజాలంతో నాలుగు వికెట్లు సాధించాడు, బుమ్రా, హార్దిక్ పాండ్యా చెరో రెండు; షమీ, ప్రసిద్ చెరో వికెట్ తీసుకున్నారు. ఇంగ్లాండ్ 49 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన ఇండియా 31 పరుగులకే నాలుగు వికెట్లు (రోహిత్ శర్మ డకౌట్; శిఖర్ ధావన్-9; రిషభ్ పంత్- డకౌట్; కోహ్లీ-16) కోల్పోయింది. సూర్య కుమార్ యాదవ్ 27; పాండ్యా-29; జడేజా-29; మహమ్మద్ షమి-23 పరుగులు చేశారు.
ఇంగ్లాండ్ బౌలర్లలో తాప్లీ-6; డేవిడ్ విల్లె, మోయిన్ అలీ, లివింగ్ స్టోన్, బ్రిడాన్ కార్స్ తలా ఒక వికెట్ పడగొట్టాడు,.
టాప్లీకే ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కిందింది.
మూడు వన్డేల సిరీస్ 1-1తో సమం అయ్యింది. సిరీస్ విజేతను నిర్ణయించే ఆఖరి మ్యాచ్ ఆదివారం మాంచెస్టర్ లో జరగనుంది.