Sunday, January 19, 2025
Homeసినిమాశ్రీరామ‌న‌వమి సంద‌ర్భంగా ‘మిస్ట‌ర్ బెగ్గ‌ర్’ మోష‌న్ పోస్ట‌ర్ లాంచ్‌

శ్రీరామ‌న‌వమి సంద‌ర్భంగా ‘మిస్ట‌ర్ బెగ్గ‌ర్’ మోష‌న్ పోస్ట‌ర్ లాంచ్‌

Beggar: కార్తిక్ మూవీ మేక‌ర్స్ ప‌తాకంపై శ్రీమ‌తి వ‌డ్ల నాగ శార‌ద స‌మ‌ర్ప‌ణ‌లో ‘బ‌ర్నింగ్ స్టార’ సంపూర్ణేష్ బాబు, అద్వితిశెట్టి హీరో హీరోయిన్లుగా వ‌డ్ల జ‌నార్థ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో గురురాజ్, కార్తిక్ నిర్మిస్తోన్న చిత్రం `మిస్ట‌ర్ బెగ్గ‌ర్`. ఈ చిత్రం దిగ్విజ‌యంగా మొద‌టి షెడ్యూల్ పూర్తి చేసుకుంది.  శ్రీరామన‌వ‌మి సంద‌ర్భంగా మోష‌న్ పోస్ట‌ర్ ఆవిష్క‌రించింది చిత్ర బృందం.  విభిన్నంగా రూపొందించిన మోష‌న్ పోస్ట‌ర్ కి మంచి స్పంద‌న వ‌స్తోంది.

ఈ సంద‌ర్భంగా నిర్మాత‌లు మాట్లాడుతూ…“మా టీమ్ పూర్తి స‌హ‌కారంతో విజ‌య‌వంతంగా మొద‌టి షెడ్యూల్ పూర్తి చేశాం. సెకండ్ షెడ్యూల్ ఈనెల 25న ప్రారంభించ‌నున్నాం. ద‌ర్శ‌కుడు చ‌క్క‌టి ప్లానింగ్  తో ఇప్ప‌టి వ‌ర‌కు అనుకున్న‌ది అనుకున్న‌ట్లుగా తెర‌కెక్కిస్తున్నారు. శ్రీరామన‌వ‌మి సంద‌ర్భంగా మా చిత్రం మోష‌న్ పోస్ట‌ర్ లాంచ్ చేశాం” అన్నారు.
ద‌ర్శ‌కుడు వ‌డ్ల జ‌నార్థ‌న్ మాట్లాడుతూ “స‌ర‌దా స‌ర‌దాగా సాగే కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ ఇది. సంపూర్ణేష్ బాబు గారు అద్బుతంగా న‌టిస్తూ ఎంతో స‌హ‌కారాన్ని అందిస్తున్నారు. ఈ నెల 25న సెకండ్ షెడ్యూల్ ప్రారంభిస్తాం. దీంతో టాకీ పార్ట్ పూర్త‌వుతుంది. మ‌రో షెడ్యూల్ లో పాట‌లు చిత్రీక‌రించ‌డానికి ప్లాన్ చేస్తున్నాం. మా నిర్మాత‌లు ఇచ్చిన ఫ్రీడమ్ తో ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా సినిమాను ఎంతో క్వాలిటీతో రూపొందిస్తున్నాం. శ్రీరామ న‌వ‌మి సంద‌ర్భంగా లాంచ్ చేసిన మోష‌న్ పోస్ట‌ర్ కు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది” అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్